Showing posts with label Numerology. Show all posts
Showing posts with label Numerology. Show all posts

Sunday, October 7, 2012

మూడో తేదీన పుట్టారా? ఐతే ఒంటరితనం అంటే ఇష్టపడరట!







మూడవ తేదీన పుట్టిన జాతకులకు తీవ్రంగా శ్రమించి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మూడవ సంఖ్య బృహస్పతికి సంబంధించినది. అందుచేత ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

ఎప్పుడూ బిజీబిజీగా కనిపించే ఈ జాతకులు ఆధ్యాత్మికం, కళలపట్ల ఆసక్తి కలిగివుంటారు. వీరికి స్నేహితులు, బంధువుల వలయం ఎక్కువ. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు. పెద్దలను గౌరవించడం, ఇతరులను ఆప్యాయంగా పలకరించడం వీరినైజం. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు వారికి తమ వంతు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యుల ఆనందాన్ని కోరుకునే ఈ జాతకులు, మతపెద్దలుగా, పురోహితులుగా, ప్రొఫెసర్లు, బ్యాంకర్స్, సైంటిస్టులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌, నటులుగా రాణిస్తారు. కానీ అత్యాశ పడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సుఖవంతమైన జీవితం గడుపుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇక మూడవ సంఖ్యలో జన్మించిన జాతకులకు కలిసి వచ్చే సంఖ్యలు : 1, 2, 9
కలిసిరాని సంఖ్యలు : 5, 6
అదృష్టాన్నిచ్చే రోజు : గురువారం
అనుకూలించే రంగు : పసుపు
అదృష్ట రత్నం : ఎల్లో సప్పైర్ లేదా టోపాజ్
వాణిజ్యానికి, వివాహానికి 3, 5, 6, 7, 9, అనే సంఖ్యలు అనుకూలిస్తాయి. ఇంకా మూడవ సంఖ్యలో జన్మించిన జాతకులు బంగారు వస్తువులు ధరించడం ఉత్తమమని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.


Saturday, October 6, 2012

మీ నెంబర్ రెండా? అయితే వైవాహిక జీవితం సూపర్!









సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన జాతకుల వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. అలాంటివారిలో రెండో తేదీన జన్మించిన జాతకులు కూడా ఉన్నారు. పుట్టినతేదీ రెండుగా ఉంటే ఆ జాతకులు వైవాహిక జీవితంలో సకల సుఖ సంతోషాలను అనుభవిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.


ఇంకా ఈ జాతకులది ప్రేమ వివాహమైతే మరింత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అదే ఒకటో తేదీన పుట్టిన జాతకులను ప్రేమించి, పెళ్లి చేసుకుంటే వీరికి తిరుగేలేదు. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే రెండో సంఖ్య వారు 3, 5, 8 సంఖ్యల్లో పుట్టిన జాతకులను వివాహమాడినా జీవితం సుఖప్రదంగా ఉంటుంది.


ఇంకా చెప్పాలంటే.. రెండో తేదీన పుట్టిన జాతకులు 25ఏళ్లలోపు వివాహం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. వీరి సంసార జీవితం వల్ల యోగ్యమైన సంతానం లభించే అవకాశముంది. వివాహానంతరం వీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.


అయితే భాగస్వామి ఎంపిక చేయడంలో రెండో సంఖ్యలో పుట్టిన జాతకులు కాస్త జాగ్రత్త వహించడం అవసరమని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.


ఇక రెండో సంఖ్యలో జన్మించిన స్త్రీలు.. అనుకున్న కార్యాల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి సహాయంతో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఈ నెంబరులో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి కార్యాన్నైనా ధైర్యంతో అనుకున్నట్లు పూర్తి చేస్తారు.


రెండో నెంబరులో పుట్టిన, స్త్రీ, పురుషులు నవరత్నాలలో జాతి ముత్యంగానీ, చంద్రకాంతి మణినిగానీ ధరిస్తే శుభాలు చేకూరుతాయి. ఇంకా ఈ జాతకులు వెండితో చేసిన వివిధ రకాల ఆభరణాలు ధరించడం చాలా మంచిది. దీంతో పాటు శివ పరమాత్మను నిత్యం పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.


మీ నెంబర్ ఒకటా...? తిరుగేలేదు మీరే లీడర్....!







సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒకటో నెంబరు అదృష్ట సంఖ్యగా కలిగినవారు తిరుగులేని వ్యక్తులుగా ఉంటారు. వీరి మాటలకు, తీసుకున్న నిర్ణయాలకు ఎదురే ఉండదు. నాయకత్వపు లక్షణాలు కలిగిన వీరంటే తోటివారు ఎంతో ఇష్టపడతారు. పదిమందికి సహాయం చేయాలని గుణం వీరిని అధినాయకునిగా నిలబెడుతుంది.


ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే, ఎవరు చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోనివారుగా ఉంటారు. అయితే ఆ నిర్ణయం తీసుకునేముందు లోతుగా ఆలోచిస్తారు. వీరికి ఒకే ఒక్క బలహీన లక్షణం ఏమిటంటే... అహం. ఈ లక్షణం నుంచి బయటపడగలిగితే అంతా విజయమే.


నా అంకెను తెలుసుకునేదెలా...?
సంఖ్యా శాస్త్రంలో ఎవరి అంకె ఏది అని తెలుసుకోవడంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే ఈ సంఖ్యను తెలుసుకోవడం చాలా సులభం. పుట్టినరోజు లేదా పేరులోని అక్షరాల సాయంతో మీ మీ సంఖ్యలను తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు మీ పుట్టినరోజు జూన్ 26, 1985 అనుకోండి...

26 06 1985

అంటే... 1985+06+26 =2017 = 2+0+1+7 = 10 = 1+0 = 1