Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Sunday, January 19, 2014

ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకులను నమిలితే...!?





తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను నశింపజేసే శక్తి తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే తులసీ ఆకులు ఆస్తమా, కేన్సర్‌లకు చెక్ పెడుతుంది. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరి చేరవు.

రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్ ఫస్ట్ స్టేజ్‌ను నయం చేయవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్ నయం అవుతుంది. రోజూ తులసీ ఆకుల్ని నాలుగేసి నమిలితే కేన్సర్ దరిచేరదు.

ఇంకా తులసీ ఆకుల్ని రోజూ నమలడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇకపోతే.. ఎయిడ్స్‌కు తులసీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి నశింపజేసే బ్యాక్టీరియానే ఎయిడ్స్‌కు కారణం. అందుచేత వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం తులసీ ఆకుల్లో ఉంది.

అలాగే బ్యాక్టీరియాలను నశింపజేసే శక్తి కూడా తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


Friday, January 17, 2014

మహిళలూ బరువు తగ్గాలనుకుంటే.. సబ్జా గింజల్ని?





మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.

బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.

ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


Friday, December 13, 2013

ఫుల్‌గా మందు కొట్టడం కంటే.. రోజూ ఓ పెగ్గు తీసుకుంటే....!?






మందుబాబులకు ఓ శుభవార్త. ఫుల్‌గా కాకుండా మీరు రోజూ లైట్‌గా ఓ పెగ్గు వేస్తారా..? అయితే పర్లేదు బతికిపోతారు! ఇదేంటి అనుకుంటున్నారా నిజమేనండి.. రోజూ కాస్తోకూస్తో తాగేవారు చక్కగా బతుకుతారట. తాగనివారి కంటే కూడా రోజూ కొద్దిగా పుచ్చుకునేవారే చక్కగా జీవిస్తారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

తాజాగా నిర్వహించిన అధ్యయనంలో లైట్‌గా మందు తీసుకునేవారి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండడంలేదని తేలింది. ఫుల్లుగా లాగించేవారికి మాత్రం ఆరోగ్యం పాడైపోయే ప్రమాదముందని మనకు తెలిసిందే.

టెక్సాస్‌ యూనివర్సిటీలోని చార్లెస్‌ హోలహాన్‌ బృందం నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఒకటి నుండి మూడు పెగ్గులను తీసుకునే వారిలో మరణాల శాతం తక్కువగా ఉందని, ఇలాంటి వారితో పోల్చుకుంటే అసలు మద్యం తాగని వారిలోనే మరణాల శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇందుకుగానూ శాస్త్రవేత్తలు సుమారు 1824 మంది వృద్ధుల మరణాలను గురించి అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో పై విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితంలో మత్తు పానీయాల జోలికి కూడా వెళ్లని వాళ్లతో పోల్చుకుంటే రోజూ రెండు మూడు పెగ్గులను లాగించేసేవారే ఎక్కువకాలం బతుకుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

Sunday, September 29, 2013

చేతి వేలు పూర్తిగా తెగితే ఏం చేయాలి.....!?






చేతి వేలు పూర్తిగా కట్ అయినట్లయితే, ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, ఐస్‌కవర్‌లో పెట్టుకుని వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలి. ప్రమాదం జరిగిన 6 నుంచి 8 గంటలు లోగా ఆస్పత్రికి చేరుకునేలా చూసుకోవాలి. సరైన సమయంలోగా ఆస్పత్రికి చేరుకుంటే సర్జరీ ద్వారా తెగిన వేలును అతికించే అవకాశం ఉంటుంది.

డ్రెస్సింగ్ చేసుకుని, రక్తస్రావం కాకుండా కట్టు కట్టుకుని ఆధునిక సదుపాయాలున్న ఆస్పత్రికి వెళితే ఉపయోగం ఉంటుంది. అక్కడ వైద్యులు రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది? కండరాలు ఎంత మేరకు కట్ అయ్యాయి? టెండాన్స్ ఎలా ఉన్నాయి? తదితర విషయాలను పరిశీలించి అవసరమైన చికిత్సను అందిస్తారు.

చేయి పూర్తిగా కట్ అయినప్పుడు కూడా సమయంలోగా ఆస్పత్రికి వస్తే ఆపరేషన్ చేసి చేయి పోకుండా కాపాడే వీలుంది. నరం కట్ అయి చేతి స్పర్శ కోల్పోయినపుడు నరాన్ని తిరిగి అతికించడం ద్వారా పోయిన స్పర్శ వచ్చేలా చేయవచ్చు. కండరం బాగా దెబ్బతింటే ఇతర భాగంలో నుంచి కండరం తీసుకుని సర్జరీ ద్వారా అమర్చడం జరుగుతుంది. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు.

రొడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి చేతులు, కాళ్లు బాగా గీరుకుపోయి ఉంటాయి. లోతైన గాయాలు ఏర్పడతాయి. అటువంటి వారికి ఈ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలతో అవయువాలు పనితీరు కోల్పోకుండా కాపాడవచ్చు.

Thursday, December 20, 2012

భోజనం తరువాత చేయకూడని 7 ముఖ్యమైన పనులు.....!?







ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారుక‌దా..! అటువంటి ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.ఆహారం తీసుకోవ‌టంలో కొద్ది పాటి మెళ‌కువ‌లు పాటిస్తే ఆరోగ్యాన్ని మ‌హా భాగ్యం గా కాపాడుకోవ‌చ్చు. ప్రతి ప్రాణి ఆహారం తీసుకోక తప్పదు. అలాంటిది మనిషి మూడు పూటలా భోజనం చేయాల్సిందే. ఇందులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌ లేదా సప్పర్‌ ఏదైనా కావచ్చు. 

మనిష తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలోని మెదడు తదితర భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ మనసు, ఆరోగ్యం ఆధారపడి వుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాదు ఆహారాన్ని ఎప్పుడు తినాలి ఎలా తినాలి అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. వాటితో పాటు, ఆహారాన్ని తీసుకొన్న తర్వాత కొన్న పనులకు దూరంగా ఉండాలి. అటువంటప్పుడే ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారు. మరి ఆహారం తీసుకొన్న తర్వాత ఎటువంటి పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం... 

మన శరీరానికి నిజమైన సుఖాన్నిచ్చేది ఆరోగ్యమే. ఈ శరీరానికి ఏ జబ్బులు రాకుండా జాగ్రత్త పడటం, ఉన్న ఆరోగ్యాన్ని పెంచుకోవటం, ఒకవేళ చెడిపోతే బాగు చేసుకోవటం అవసరం. యంత్ర రూపమైన మన శరీరంపై చుట్టూరా ఉన్న వాతావరణ ప్రభావం ఎల్లప్పు డూ ఉంటుంది. ఈ వాతావరణం ప్రతిరోజు కొద్దిగా, ప్రతికార్తెలో ఎక్కువగా, ప్రతి ఋతువులో మరీ ఎక్కు వగా మారుతుందని మనకు తెలుసు. ఈ ప్రభావం మన శరీరానికి హాని కలిగించకుండా ఆరోగ్యంగా జీవించగల్గుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించ వలసిన నియమాలే స్వస్థవృత్తం.


పొగ తాగకూడదు: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక సిగరెట్ కాల్చితే అది పది సిగరెట్ లకు సమానము అని చెబుతున్నారు వైద్యనిపుణులు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.

భోజనం తిన్న వెంటనే పండ్లుకు బ్రేక్: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత పండ్లు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.

టీ - కాఫీలకు బ్రేక్: భోజనానంతరం టీ మరియు కాఫీలకు తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది. కాఫీలోని కెఫిన్ వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది.

బెల్ట్ లూజ్ చేయకూడదు: సాధారణంగా మగవారు ప్యాంట్ కు ఖచ్చితంగా బెల్ట్ వేస్తుంటారు. ఫ్యాషన్ అంటూ అమ్మాయిలు కూడా వారి వారి సౌకర్యాన్ని బట్టి బెల్టులు వేసుకొంటుటారు. భోజనం తర్వాత బెల్టు లూస్ చేయకూడదు. దీనివల పొట్టలోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.

స్నానం: భోజనానంతరం స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.


నడక: చాలా మంది భోజనం తర్వాత కొంత దూరమైన నడవాలంటారు. భోజనం తర్వాత వంద అడుగులు నడవటం వల్ల తొంభైతొమ్మిదేళ్ళు జీవిస్తారంటారు. ఇది నిజం కాదు. భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ తగిన ఆహార పోషణ గ్రహించలేకపోయే అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం నడక అవసరం లేదు.

భోజనం తర్వాత నిద్ర: భోజనానంతరం నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గాస్ట్రిక్ మరియు ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డాక్టర్లు. తప్పకుండా ఇవన్ని పాటిస్తారు కదూ!


Wednesday, December 19, 2012

హెర్నియా అంటే ఏమిటి.....!?







హెర్నియా అంటే ఏమిటి? :  

గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. కారు లేదా బైక్‌ టైర్‌ పంచర్‌ అయినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు ట్యూబ్‌ ఆ ప్రాంతంలో ఉబికి వచ్చినట్లుగా ఉంటుం ది. హెర్నియాలో ఇలాగే జరుగుతుంది. ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో నొప్పి ఉన్నట్లు అనిపించక పోయినా ఆ తర్వాత సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి.

హెర్నియా పలు రకాలు:-

* 1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)


* 2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)


* 3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical      Hernia)


* 4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

వ్యాధి లక్షణాలు:-

1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. 

2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 

2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 
3. వృద్ధుల్లో. 
4. ఊబకాయం గలవారికి. 
5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 
6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


వ్యాధి నిర్ధారణ పరీక్షలు:-


ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు.

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

హెర్నియా ఎందువల్ల వస్తుంది?


పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుంది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

హెర్నియా ఏర్పడిన తరువాత ఏం జరుగుతుంది?


హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

హెర్నియాతో ఎలాంటి సమస్యలు రావచ్చు?


నిరంతరాయంగా తీవ్రమైన నొప్పి, వాపు, తీపు ఉండవచ్చు. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలే. సర్జరీ ద్వారా హెర్నియాను తొలగించుకోవచ్చు.

హెర్నియాను నయం చేయడమెలా?


లోకల్‌ అనస్తేషియా ఇచ్చి మూడు, నాలుగు అంగుళాల గాటు చేయడం ద్వారా సర్జరీ చేస్తారు. పేషెంట్‌ 5 రోజుల్లోఇంటికి వెళ్ళవచ్చు. లాప్రోస్కోప్‌ ద్వారా కూడా ఇది చేయవచ్చు. దీనికి జనరల్‌ అనస్త్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్‌ మరుసటి రోజు ఇంటికి వెళ్ళవచ్చు.

హెర్నియా సర్జరీతో ఇతర దుష్ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఏవైనా ఉంటాయా?

 
ఏ ఆపరేషన్‌కైనా ఇతర దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. హెర్నియా కూడా ఇతర సాధారణ ఆపరేషన్‌ లాంటిదే.
మరీ ముఖ్యంగా లోకల్‌ అనస్తీషియా ఇచ్చి చేసినప్పుడు.దీనిలో వాటిల్లే సమస్య లు మాత్రం చాలా తక్కువ....!!!



Saturday, December 1, 2012

కండోమ్ ధరించేందుకు చిట్కాలు....!?






రతిలో కండోమ్ ధరించేందుకు అవస్ధలు పడుతున్నారా? భాగస్వామి సహకరించంటంలేదా? వెయిట్! కొన్ని చిట్కాలు పాటించి అసలైన హద్దులు మీరకముందే కండోమ్ ధరించండి! కండోమ్ లు వివిధ రకాలు సైజులతో వివిధ ఉపయోగాలుగా వస్తాయి. ప్రెగ్నెన్సీనుండి లేదా గుప్త రోగాలనుండి రక్షించుకునేటందుకు కండోమ్ గొప్ప సాధనంగా చెప్పచ్చు. 

కండోమ్ మంచి కండిషన్ లో వుండాలన్నా, మన్నికగా వుండాలన్నా దానిని కూల్ మరియు పొడి ప్రదేశంలో వుంచాలి. కండోమ్ లు కొనేటపుడు వాటి ఎక్స్ పైరీ తీదీకి చూడండి. లేదంటే పాతవైతే రతిక్రీడలో చినిగి ఇబ్బంది కలిగించవచ్చు. కండోమ్ ను మీ భాగస్వామి నోటిలో లేదా నాలికపైనా పెట్టకండి. మరణంలాంటి హాని కూడా జరగవచ్చు.

రతిక్రీడలో కండోమ్ పెద్ద అడ్డంకి, మూడ్ పాడు చేస్తుంది... అంటూ చాలామంది జంటలు భావిస్తూంటారు. అయితే, ఆరోగ్యాన్ని పాడుచేసుకోరాదంటే కొన్ని పద్ధతులు అవలంబించాల్సిందే! ఎల్లపుడూ లూబ్రికేట్ చేయబడ్డ కండోమ్ మాత్రమే వాడండి. అది పగిలిపోకుండా అంగప్రవేశం కూడా తేలికగా జరిగిపోతుంది. కొన్నిసార్లు మహిళలు రతిక్రీడలో ఆసక్తి లేకపోవటం వలన ద్రవాలను స్రవించరు. అపుడు కండోమ్ కు గల లూబ్రికేషన్ బాగా పనిచేస్తుంది. కండోమ్ ధరించేముందు వీటిని పాటించండి. 

1. సాధారణంగా దొరికేది కాక, ఎపుడూ సరి అయిన సైజు కండోమ్ నే ధరించండి. కండోమ్ దేనికి ఉపయోగిస్తున్నారో నిర్ణయించుకోండి. గర్భవతులు కాకుండా రక్షణకా లేక అంగప్రవేశం తేలికై సంతోషం కలగటానికా లేక నోటితో సెక్స్ చేసేందుకా అనేది నిర్ణయించుకోండి. 

2. మరీ అధిక బిగువు కల కండోమ్ అసౌకర్యంగా వుండి చినిగిపోవచ్చు. లేదా పెద్దదైతే బయటకు పడి అనవసర ఇబ్బందులు కలగవచ్చు. కనుక సరి అయిన సైజు వాడకం సూచించదగ్గది. 

2. నోటితో సెక్స్ చేయాలనుకుంటే మంచి వాసనగల కండోమ్ ధరించండి. అదికూడా మీ భాగస్వామికిష్టమైన ఫ్లేవర్ సుమా! మరల అదే కండోమ్ ను అంగ ప్రవేశానికి వాడకండి. నోటిసెక్స్ కు వాడే కండోమ్ లకు తియ్యగా వుండటానికి షుగర్ కలుపుతారు. అది అంగప్రవేశ సమయంలో అనవసర క్రిములను లోపల ప్రవేశపెడుతుంది. 

4. అధిక సురక్షితమంటూ ఒకదానిపై ఒకటిగా అదనపు కండోమ్ ధరించకండి. ఇలా చేస్తే అధిక రాపిడి కలిగి కండోమ్ లు తేలికగా పగిలిపోయే అవకాశం వుంది. 

5. స్కలనానికి ముందు ఒకసారి కండోమ్ తీసివేస్తే మరల దానినే ధరించకండి. సురక్షితంగా వుండాలంటే కొత్తది ధరించండి. 

6. రొమాన్స్ అధికం చేసుకోడానికి అంగప్రవేశంలో వివిధ రకాల అనుభవాలకు రకరకాల లూబ్రికేటెడ్ కండోమ్ లు ధరించండి. ఇరువురికి ఇష్టమైన వాటినే ధరించండి. ప్రత్యేకించి మీ భాగస్వామికిష్టమైనదే వాడండి.


Monday, November 26, 2012

స్పెర్మకౌంట్ (వీర్యకణాల) పెరుగుదలకు జీడిపప్పు...!?







ప్రతి ఒక్కరు తమ మెనూలో ఉండేలా చూసుకోవాల్సిన ఆహారం జీడిపప్పు. జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. అనేక పోషకవిలువలు జీడిపప్పులో ఉన్నాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడే ఫైటో కెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోజు జీడిపప్పు తినే వారిలో మంచి కొలెస్టరాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.

స్పెర్మటోజెనెసిస్: ప్రతిరోజు పది జీడిపప్పు పలుకులు తింటే వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉన్నవారికి జీడిపప్పు మంచి ఆహారం. ఒకనెలరోజుల పాటు జీడిపప్పు తీసుకుని ఆ తరువాత సెమన్ అనాలసిస్ చేయించుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. సంతానలేమితో బాధపడే వారికి జీడిపప్పు తప్పక తీసుకోవాలి.

కొలెస్టరాల్, గుండెజబ్బులు: జీడిపప్పులో గుండెకు రక్షణనిచ్చే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని బ్యాడ్ కొలెస్టరాల్‌ను తగ్గించడంలోనూ, మంచి కొలెస్టరాల్‌ను పెంచడంలోనూ ఉపయోగపడతాయి. మెడిటేరియన్ డైట్‌లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనల్లోసైతం వెల్లడయింది.

మినరల్స్ డెఫిషియెన్సీ: జీడిపప్పులో మాంగనీస్, పోటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు జీడిపప్పు తీసుకోవడం వల్ల మినరల్ డెఫిషియెన్సీ రాకుండా చూసుకోవచ్చు.

యాంటీ అక్సిడెంట్: సెలీనియం చాలా ముఖ్యమైన పోషకపదార్థం. ఇది గ్లూటాథయోన్ పెరాక్సిడేసెస్ వంటి యాంటీఅక్సిడెంట్ ఎంజైమ్స్‌కి కో-ప్యాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ శరీరంలో అత్యంత శక్తివంతమైన యాంటీ అక్సిడెంట్‌లలో ఒకటి. కాపర్ కూడా సైటోక్రోమ్ సి-అక్సిడేస్, సూపర్అక్సైడ్ డిస్‌మ్యూటేస్ వంటి ప్రాణాధార ఎంజైమ్‌లకి కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. జింక్ చాలా ఎంజైమ్‌లకి కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. పెరుగుదల, జీర్ణక్రియ వంటి పనులు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.

విటమిన్ల మిశ్రమం: జీడిపప్పులో పాంటోథెనిక్ యాసిడ్(విటమిన్-బి5), పిరిడాక్సిన్(విటమిన్-బి6), రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు శరీరానికి చాలా అవసరం.

కళ్ల సమస్యలు: జీడిపప్పులో అనేక ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ యాంటీఅక్సిడెంట్ ఉంటుంది. ఇది వయస్సు పెరిగిన కొద్దీ వచ్చే కళ్ల సమస్యల నుంచి రక్షిస్తుంది.


Thursday, November 22, 2012

ఆపిల్ కంటే అరటి పండు శ్రేష్టమైనదట...!??






ఆపిల్ పండు కంటే అరటిపండు అనేక రెట్లు శ్రేష్టమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేడ్లు ఆపిల్ పండ్లలో కంటే రెండింతలు ఎక్కువగా అరటి పండ్లలో ఉన్నాయి. ఫాస్పరస్ మూడింతలు, ప్రోటీన్ల శాతం కూడా ఆపిల్ కంటే అధికంగా ఉంది. విటమిన్ ఎ, ఇనుము శాతం, విటమిన్లు, పొటాషియం వంటివి ఆపిల్ కంటే అరటి పండులోనే అధికంగా ఉన్నాయి.

ఇదే విధంగా ఒక అరటి పండు 23 గ్రాముల కార్పోహైడ్రేడ్లు, 12 గ్రాముల చక్కెర, 2.6 పీచు పదార్థాలు, ఒక గ్రామ్ ఫాట్, 9 మిల్లీ గ్రాముల విటమిన్ కలిగివుంది. తద్వారా శరీరానికి కావాల్సిన 90 కెలోరీలు అరటి పండులో ఉన్నాయి.

ఇకపోతే.. అరటిపండు శరీర వేడిని తగ్గించడం, ఉదర సమస్యలకు చెక్ పెడుతుంది. అల్సర్‌కు అరటిపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అరటిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండటంతో అంటువ్యాధులు దరిచేరవు.


Wednesday, November 21, 2012

జీడిపప్పుతో పక్షవాతం దూరం చేసుకోండి..!!?







మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. ఇది సుమారు 300 రకాల జీవ రసాయనిక చర్యల్లో పాలు పంచుకుంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దీన్ని బట్టే అర్థమవుతుంది. మన శరీరంలోని మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది.

మిగతాది కణాల లోపల, కణజాలంలో, అవయవాల్లో ఉంటాయి. కండరాలు, వాడుల పనితీరు సక్రమంగా జరగాలంటే ఈ మెగ్నీషియం ఎక్కువగా తోడ్పడుతుంది. ఇది పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.

మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పూ తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియంలో అదనంగా 100 మిల్లీగ్రాముల మోతాదు పెరుగుతున్నకొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నారు.

పొట్టు తీయని ధాన్యాలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్స్), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కప్పు బీన్స్ లేదా ముడి బియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన పాలకూర తింటే సుమారు 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకూ దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినటం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు.


 

నీళ్లు తాగి హార్ట్ ఎటాక్‌ని దూరం చేసుకోండి..!!?







దాహమేసినప్పుడు కాకుండా మంచి నీళ్లని ఒక పద్దతిలో తాగితే కొన్ని రకాల లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

* తొంబైశాతం హార్ట్ ఎటాక్‌లు తెల్లవారు ఝామునే వస్తాయట. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగితే ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

* నీళ్లు తాగడం మంచిదని తెలుసు కాని వాటికి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోకండి.

* నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగితే శరీరంలోని అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయట.

* భోజనానికి అర గంట సమయం ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆహారం బాగా జీర్ణమవుతుంది.

* స్నానానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే రక్త పీడనం (బీపీ) తగ్గుతుంది.

దీన్ని బట్టి ఆహారానికి ఒక క్రమశిక్షణ ఎలా అవసరమో మంచినీళ్లు తాగే విషయంలోనూ అలాంటి క్రమశిక్షణ పాటించాలని తెలుస్తోంది.



షుగర్ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు...!?








మధుమేహంను పరిష్కరించడం చాలా క్లిష్టమైన సమస్య. అయితే మధుమేహలక్షణాలను గుర్తించి, సరైన నియంత్రణ పద్దతులను పాటించి నివారించుకోవచ్చు. మధుమేహం సోకకుండా ఉండేదుకు మీకు కొన్ని సూచనలను అందిస్తున్నాం.. వీటిని కనుక ఫాలో అయినట్లైతే తప్పకుండా షుగర్ మీ దరిచేరదు. మరి ఆ సూచనలేంటో చూద్దాం...

1. వ్యాయామం: కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్లియర్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీవక్రియ క్రమంగా పనిచేసి, షుగర్ రాకుండా సహాయపడుతుంది.

2. నో షుగర్: చక్కెర వినియోగం ద్వారా రక్తలోని షుగర్ స్థాయిలను కనుక్కోవచ్చు. అయితే కృత్రిమంగా తయారు చేసినటువంటి తియ్యంటి ఆహారాలు మరియు విషపూరిత పానీయాల వినియోగం ద్వారా మధుమేహం యొక్క ఆగమనం ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తిని నిషేదించి, అధిక చక్కెర శాతాన్ని కలిగి ఉంటుంది. అందువలన పంచదారతో తయారు చేసినటువంటి ఉత్పత్తుల వాడకంను పూర్తిగా నివారించడం మధుమేహగ్రస్తులకు ఉత్తమమైన విధానం.

3. ఫైబర్: నిత్యం ఫైబర్ తీసుకోవండ వలన మధుమేహం, క్యాన్సర్, గుండెకు సంబంధించిన జబ్బులు దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోచేయడానికి, చెక్కర స్థాయిని నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. ఫైబర్ ఆహారం తసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ ను గ్రహించి క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. మొలకెత్తిన గింజలు, ఓట్స్, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ పప్పులు, రాగి, బాదం వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ పరిమితంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మధుమేహం, ఊబకాయం దరిచేరవు.

4. తాజా పండ్లు మరియు కూరగాయలు: ప్రతిరోజు పండ్లు, కూరగాయలు, మీ ఆహారంలో ఉండేలా చర్యలు తీసుకోండి.ఇందులో రెండు నుంచి నాలుగు తాజా
పండ్లు ఉండాలి. పెసలు ... పీచు పదార్ధాలు తీసుకోకుండా వుంటే మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. కాబట్టి మధుమేహ గ్రస్తులు తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రాకారం విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోలోనూ, ఎముకలు దడంగాను ఉంటాయి. అలాగే తాజా కూరగాయల్లో శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, పొటాషియం, కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రోటీనులు శరీరానికి కావలసిన ఇన్సులిన్ ఉత్పత్తిని అందిస్తుంది.


5. గ్రీన్ టీ: రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశఆలు తక్కువ. ... గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ రాకుండా నివారించడం లేదా ఆలస్యం చేయడం. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది . టీలో ఉండే పాలీఫెనాల్స్‌ మెటాబాలిజంను ప్రేరేపిస్తుంది. గ్రీన్‌ టీ తక్కువ ప్రాసెస్‌ అయి ఉండడమే కాక అందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

6. కాఫీ: కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలడం విశేషం. టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. చాయ్‌ని రోజూ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగడంతో పాటు ధమనుల గోడలు దృఢంగా తయారవుతున్నాయని, డయాబెటిస్ రాకుండా టీ నివారిస్తుందని పరిశోధకులు అంటున్నారు. చాయ్ ద్వారా శరీర నిర్మాణానికి అవసరమైన ఎంజైమ్‌లు, కార్బోహైవూడేట్‌లు, ప్రొటీన్‌లు, లిపిడ్‌లు అందుతున్నాయని తేలింది.

7. భోజనం: ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.సమయానుగుణంగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు తీసుకునే అహారంలో పీచు పదార్థాలు అధికంగా వుండేలా చూసుకోవాలి. అంటే రోజుకు సుమారు 400 నుంచి 500గ్రాములు కూరగాయలు తీసుకోవాలి. డైట్‌లో చిరుధాన్యాలు ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే రకమైనవి కాకుండా కలగలిపి తీసుకోవాలి. రైస్ మాత్రమే తీసుకోకుండా రైస్‌తో పాటు గోధుమలు, జొన్నలు, రాగులు..ఇలా రెండు, మూడు రకాల ధాన్యాలను కలిపి తీసుకోవాలి. డయాబెటిస్ ఉందని తెలిసినప్పుడు డైటీషియన్ను కలిసి ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరంగా తెలుసుకుంటే మంచిది.

8. దాల్చిన చెక్క: మీరు తీసుకొనే ఆహారంలో దాల్చిన చెక్క పొడిను తీసుకోవడం మంచిది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. గోరువెచ్చని నీటితో చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి గుడ్ బై చెప్పవచ్చు.

9. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి: మధుమేహం ఉన్నవారు ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గాఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళను అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించుకోవాలి.

10. ప్రోటీన్ డయట్: శరీరంలో శక్తి పెంపొందించుకోవడానికి ప్రోటీనులను అంధించే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అదే ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది. సరిపడా నిద్ర - శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అందుకోసంఅధిక ప్రోటీన్ ఉన్న పదార్ధాలు అంటే చేప, మాంసం, కాయగూరలు, బీన్స్ తినాలి.

11. ఫ్యాట్ ఫుడ్స్: ఫ్యాట్ ఫుడ్స్ ను పూర్తిగా తినడం మానుకోవాలి. తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు,ఫాస్ట్ పుడ్స్ మానుకో వాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసు కునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గిం చాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.

12. ఉప్పు వినియోగం తగ్గించాలి: ప్రకృతిలొ మనకి లభించే..ఉప్పు, చక్కెర. నెయ్యి వరమే కాదు ఒక్కోసారి శాపంగా కూడా మారుతాయి.అందుకే ఇవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఉప్పు, కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరభాగాల్లో సమస్యలు మొదలై బీపీ, షుగర్ వ్యాధులకు కారణమవుతాయి. ఏ రకం.. ఏ సమస్య.. టైప్ 1 రకం మధుమేహం ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. బీటా కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

13. ఎక్కువ నీళ్ళు తాగాలి: నీటిని ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యానికి మంచిది. రక్తంలో ఉన్న హై షుగర్ కంటెంట్ను కంట్రోల్ చేసి ఒత్తిడిని, ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. ప్రతి రోజూ రెండున్నర లీటర్లు నీటిని తీసుకోవాలి. నీరు సేవించడం వల్ల ఆరోగ్యానికే కాకుండా డయాబెటిక్ లక్షణాలను దరిచేరనివ్వదు.

14. వెనిగర్: వెనిగర్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచే ఓ అద్భుతమైన డైటేరియన్ ఫుడ్ అని చెప్పవచ్చు. భోజనానికి ముందు రెండు టీస్సూన్ల వెనిగర్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

15. సోయా: డయాబెటిస్ పేషంట్స్ సోయా ఉత్పత్తులను విరివిగా వాడవచ్చు. రక్తంలోని షుగర్ కంటెంట్ ను కంట్రోల్లో ఉంచి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్నచిన్న సూచనలు తప్పకుండా పాటిస్తే డయాబెటిస్ రాకుండా అదుపు చేసుకోవచ్చు. ఈ సూచనలు డయాబెటిస్ పేషంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి.

Tuesday, November 20, 2012

గుప్పెడు పిస్తా పప్పుతో గుండెను ఒత్తిడి నుంచి కాపాడండి..!?







పిస్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. ప్రతిరోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకోవడం ద్వారా లోబీపీ, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలోనూ పిస్తా పప్పులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు.

ఆధునిక యుగంలో బిజీ షెడ్యూల్ కారణంగా అనేకమంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇంకా ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. ఫలితంగా హృద్రోగ వ్యాధులు కూడా ఎక్కువైపోతున్నాయని జర్నల్ హైపర్‌టెన్షన్ రచయిత డాక్టర్ షీలా వెల్లడించారు. అందుచేత ప్రతిరోజూ పిస్తా పప్పులను తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటును నియంత్రించవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tuesday, October 30, 2012

బంగారు నీటితో ఏనుగులాంటి బలం మీ సొంతం చేసుకోండి..!!








* ప్రతిరోజు నల్లనువ్వులను తిని, చల్లని నీరు త్రాగినట్లైతే శరీరానికి కావాల్సిన బలం అందుతుంది.

* బంగారాన్ని నీటిలో వేసి కాచి, ఆ నీటిని తాగినట్లైతే ఏనుగులాంటి బలం కలుగుతుంది.

* తాజా వెన్నను ప్రతిరోజూ ఉదయం తినాలి.

* నీటిలో ఖర్జూరపండ్లు నానబెట్టి బాగా కలిపి, ఆ నీటిని తాగాలి.

* మర్రిపండులోని గింజలు తినాలి.

* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లు తింటే శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. దాంతో పాటు ఏ వ్యాధులు     రాకుండా ఉంటుంది.

* పాలలో అతిమధురం పొడికలిపి తాగాలి.

* ద్రాక్ష లేక కిస్‌మిస్ రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం బాగా కలిపి ఆ నీరు తాగాలి.


Sunday, October 28, 2012

వీర్య గ్రంథికి హోలెప్ విధానం ద్వారా చికిత్స!!







తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని ఆర్.జి స్టోన్ యూరాలజీ అండ్ లాప్రోస్కోపీ హాస్పిటల్ అధునాతన శస్త్రచికిత్స విధానం ద్వారా వీర్యగ్రంథికి ఆపరేషన్లను విజయవంతంగా చేస్తోంది. వంద గ్రాముల కంటే ఎక్కువ బరువున్న వీర్యగ్రంథులను హోలెప్ శస్త్రచికిత్స విధానం ద్వారా చికిత్స చేస్తారు.

ఇదే అంశంపై ఆ ఆస్పత్రి హెడ్, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్.విజయ్ కుమార్ గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ వీర్య గ్రంథి అనేది పురుషుల్లో మూత్ర సంచికి దిగువ భాగంలో మూత్రనాళానికి సమీపంలో వస్తుందన్నారు. ఇది సాధారణ పురుషుల్లో 20 గ్రాముల బరువును కలిగివుంటుందన్నారు.

వయస్సు పెరిగే కొద్ది పురుషులందరిలో ఈ వీర్య గ్రంథి సైజు పెరుగుతుందన్నారు. దీన్ని బెనిగన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లాసియా (బీపీహెచ్) అంటారన్నారు. ఈ వీర్యగ్రంథి సైజు పెరిగే కొద్దీ మూత్ర విసర్జన సమయంలో తీవ్రనొప్పి కలుగుతుందన్నారు. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రరూపం దాల్చి ప్రమాదకర పరిస్థితికి జారుకుంటుందన్నారు.

ఈ తరహా వ్యాధితో చెన్నయ్ నగరంలో అనేక మంది బాధపడుతున్నారన్నారు. వీరిలో అవగాహన కల్పించడంతో పాటు... సులభతరమైన లేజర్ చికిత్సా విధానం ద్వారా ట్రీట్‌మెంట్ చేయవచ్చన్నారు. ఈ విధానం ద్వారా వైద్య ఖర్చులు విదేశాల్లో లక్షల్లో వసూలు చేస్తారన్నారు. కానీ, తాము 60 వేల నుంచి రూ.90 వేలుగా వసూలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించి, ఈ చికిత్సా విధానం ద్వార వీర్యగ్రంథి సమస్య నుంచి విముక్తి కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో యూరాలజీ కన్సల్టెంట్ ఎం.జీవగన్, జీఎస్. వేణుగోపాల్, జైగణేష్ తదితరులు పాల్గొన్నారు. 


Thursday, October 18, 2012

విస్కీ సేవించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...








మందు ఎప్పుడో ఒకసారి తాగితే సంతోషం... అప్పుడప్పుడూ తాగితే వ్యసనం.... రోజూ తాగితే రోగం... అన్న విషయాన్ని గుర్తుంచుకొంటే... ఆల్కహాల్ అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యం కాదు. ఆల్కహాల్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొన్ని రకాలైరటువంటి ఆల్కహాల్ అంటే వైన్ మరియు బ్రాండీ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వింటుంటాం.. బహుషా అందుకేనేమో గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీకి గ్రేప్ వైన్, ఆపిల్ వైన్ అని వారికి ఇస్తుంటారు. ఆల్కహాల్ కు సంబంధించిన విస్కీలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్య కలగక మానదు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం...

మంచి నిద్ర: కొన్ని రోజులుగా అంటే పది పదిహేను రోజులుగా ఎక్కువగా కష్టపడి, లేదా జర్నీ చేయడం వల్ల శరీరం ఎక్కువగా అలసినప్పుడు విస్కీలో ఐస్ చేర్చి ఒకటి లేదా రెండు పెగ్గులు తాగడం వల్ల నిద్ర బాగా పట్టి శరీరానికి విశ్రాంతినిస్తుంది. తాగడం కూడా హర్రీగా తీసుకోకుండా తక్కువ మోతాదులో కొద్దిగా కొద్దిగా తీసుకోవడం వల్ల బాగా పనిచేస్తుంది. తాగిన కొద్ది సేపటికే నిద్రలోకి జారుకొని, గాఢ నిద్రను పొందుతారు.

క్యాన్సర్: చాలా మంది ఆల్కహాల్ క్యాన్సర్ కు దారితీస్తుందని చెబుతుంటారు? అయితే అది నిజం కాదనే చెప్పాలి. ఎందుకంటే విస్కీలో ఉన్న ఎలాజిక్ యాసిడ్స్ క్యాన్సర్ ఉత్ప్రేరకాలను తగ్గిస్తుంది. విస్కీని తరచూ తీసుకోకుండా ఏదో ఒక సందర్భంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటిఆక్సిడెంట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఏప్పుడో ఒక సారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.

మధుమేహానికి: విస్కీ లో మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండటం వల్ల, ఇది శరీరంలోని రక్తనాలల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. విస్కీలో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధి బారీన పడకుండా చేస్తుంది. మధుమేహగ్రస్తులు కూడా అతి తక్కువ మోతాదులో వారానికి ఒక సారి విస్కీని తీసుకోవడం వల్ల రక్త నాళాలు ఫ్రీ అవుతాయి.

ఒత్తిడిని దూరం చేసే విస్కీ: ఒత్తిడిని దూరం చేసే గుణం కూడా విస్కీలో ఉంది. ఎక్కువ రోజులగా ఏదైనా కారణం చేత ఎక్కువగా ఒత్తిడికి గురౌతున్నట్లైతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అది ఫిజికల్ గా మెంటల్ గా అనారోగ్యం చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ తో ఉన్నప్పుడు విస్కీని కొద్దిగా తీసుకోవడం వల్ల మానసిక ప్రభావం నుండి బయటపడేలా చేస్తుంది. శరీరం కొంత విశ్రాంతి పొంది మునుపటి కంటే కొంచెం సౌకర్యంగా ఫీలవుతారు.

జలుబు - దగ్గు: బాగా కోల్డ్ చేసి, దాంతో పాటు దగ్గు ఉన్నప్పుడు హాట్ విస్కీని కొద్దిగా తీసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది. మంచి క్వాలిటీ ఉన్న విస్కీ, ప్రత్యేకంగా స్కాచ్, మరియు దీనికి కొద్దిగా హాట్ వాటర్, ఒక చెంచా తేనె, మరియు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
 
ఇతర వ్యాధులు: విస్కీని నెలకోసారి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి, చిన్న చిన్న జబ్బులను రానివ్వకుండా చేస్తుంది.





Thursday, June 7, 2012

ఆపిల్స్, ఉల్లి, ఆరెంజ్‌లతో రక్తనాళ సమస్యలకు చెక్...!!?






మీరు రక్తనాళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే రోజూ ఒక ఆపిల్ తీసుకోండి. తాజా అధ్యయనంలో ఆపిల్స్, ఉల్లి, ఆరెంజ్‌లను తీసుకోవడం ద్వారా రక్తనాళ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తేలింది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌ నిర్వహించిన పరిశోధనలో ఆపిల్స్, ఉల్లిపాయలు, ఆరెంజ్‌లను తీసుకోవడం ద్వారా రక్తనాళాలు మూసుకుపోవడం వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని తెలియవచ్చింది. రోజుకో యాపిల్ పండు లేక కమలాఫలం లేక ఉల్లిగడ్డ తింటే చాలు రక్తం గడ్డకట్టదు. అంతేకాదు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువే.

యాపిల్, ఆరెంజ్, ఉల్లిగడ్డల్లో ఉండే రుటిన్ అనే రసాయనం సిరలు, ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా బ్లాక్, గ్రీన్ టీల సేవనంతో రక్తనాళాలు మూసుకుపోవడంతో ఏర్పడే గుండెపోటు వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు తెలిపారు.


పెరుగు, మజ్జిగ వాడితే నోటి క్యాన్సర్ రాదట....!?







పెరుగు, మజ్జిగ వాడితే నోటి క్యాన్సర్ రాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగు కడుపులో గ్యాస్ తయారు కాకుండా, కడుపు ఉబ్బరంగా వుండకుండా నివారిస్తుంది. ఆకలిని పెంపొందిస్తుంది. విష పదార్థాల్ని దూరంగా ఉంచుతుంది. పెరుగు వాడడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. స్త్రీలలో కనిపించే ఈస్ట్ జబ్బుని తగ్గిస్తుంది. పెరుగు రక్తంలోని కొలెస్టరాల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఫంగస్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది.

మరోవైపు వేసవితాపం తీరాలంటే.. ఒక చెమ్చా అల్లపురసం, కొంచెం పటికబెల్లం ముక్క, ఒక కప్పు నీటిలో కలిపి ఆ నీటిని తీసుకోవాలి. అరచెమ్చా అల్లపురసం, అరచెమ్చా తేనె కలిపి సేవిస్తే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.

అజీర్ణం కారణంగా కడుపునొప్పిగా వుంటే ఒక చెమ్చా అల్లపురసంలో ఒక చెమ్చా పంచదార కొద్దిగా నీటిలో కలుపుకుని తాగితే కడుపునొప్పి నిదానంగా తగ్గిపోతుంది. ఆహారంలో రోజూ అల్లపుముక్కను ఏదో విధంగా వాడితే కడుపు ఉబ్బరం వుండదు. జీర్ణ సంబంధ చిక్కులు వుండవు. తల తిరిగినట్లు అనిపించినా తలభారం అధికంగా వున్నా అరచెమ్చా అల్లపురసం, అరచెమ్చా నిమ్మరసం కలిపి తీసుకోవాలి.


Wednesday, June 6, 2012

రోజుకు మూడు లేదా నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే.!?





రోజుకు మూడు, నాలుగు ఖర్జూరాలు తీసుకోవడం వైద్యం దృష్ట్యా ఎంతో మంచిది. ఖర్జూరాల్లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీ ఖర్జూరాలు తింటే మంచిది. ఖర్జూరాల్లో ఫాస్ఫరస్ వుంది. కాబట్టి దీన్ని తింటే కేశాలు రాలిపోవడం, చుండ్రు వంటివి వుండవు.

అజీర్ణంతో బాధపడేవారు రోజూ పరగడుపున ఖర్జూరాలు తింటే మంచిది. ఖర్జూరాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎనీమియా వ్యాధి వున్నవారు తినడం మంచిది. చిన్నపిల్లలకు చాక్లెట్లు తినే అలవాటు మాన్పించాలంటే ఖర్జూరం తినటం అలవాటు చేయాలి.

ఖర్జూరంలో ప్రోటీన్లు, కాల్షియం, చక్కెర, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బి పుష్కలంగా ఉన్నాయి. నానబెట్టిన ఖర్జూరాలను పాలలో ఉడకబెట్టి, దానిని అరటి పండ్ల ముక్కలను కలిపి తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమని వైద్యులు చెబుతున్నారు.