శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు. కాని ఎక్కువగా చేసుకునేది, అందరికి ఇష్టమైన పిండివంట ఏంటి?అంటే జంతికకే ఎక్కువ ఓట్లు పడతాయంటే అతిశయోక్తి కాదుకదా. ప్రతి తెలుగువారింట ఈ జంతికల గొట్టం ఉండి తీరాల్సిందే మరి. ఇవి తయారు చేసుకున్న తర్వాత దాదాపు పదిరోజులు నిల్వ ఉంటాయి. బియ్యంపిండితో చేస్తాం కాబట్టి ఆరోగ్యరిత్యా కూడా ఎటువంటి చెడు చేయదు. కాని దంతసిరి కాస్త బలంగా ఉండాలి. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు.
కావలసిన వస్తువులు :-
బియ్యం: 3cups
మినప్పప్పు : 1cup
పుట్నాలపప్పు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
వెన్న లేదా డాల్డా: 2tbsp
నువ్వులు: 1tbsp
కారంపొడి : 2tbsp(రుచికి తగినంత)
జీలకర్ర : 1/2 tsp
నూనె -వేయించడానికి
1. ముందుగా బియ్యం కడిగి , అరగంట పాటు నానబెట్టి, వడగట్టి నీడలోబట్టపై వేసి ఆరనివ్వండి. పూర్తిగా అరిన తర్వాత దోరగా, కమ్మని వాసన వచ్చేవరకు నిధానంగా వేయించుకోవాలి.
2. ఇందులో మినప్పప్పు, పుట్నాలపప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఈ పిండిలో తగినంత ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర, వెన్నలేదా డాల్డా కరిగించి వేయాలి. (వెన్న తెల్లది వాడాలి. ఉప్పు వేసినది కాదు) మొత్తం బాగా కలపాలి. చేతితోవెన్న బాగా కలిసేట్టుగా చేయాలి.
3. తరవాత కొద్దికొద్దిగా నీరు కలుపుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. తడిగుడ్డ కప్పి ఉంచాలి. పదినిమిషాల తర్వాత పిండిని బాగా మర్దించి మృదువుగా చేయాలి.
4. ఇప్పుడు జంతికల గొట్టంలో మీకు కావలసిన, ఇష్టమున్న రంధ్రాలున్న బిళ్లను పెట్టి, పిండి నింపి ఒక తడిగుడ్డ లేదా ప్రాస్టిక్ పేపర్ మీద గుండ్రంగా జంతికలు వత్తుకోవాలి.
5. తర్వతా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో జంతికలు మెల్లిగా వేయాలి, మీడియం మంట మీద నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు రెండువైపులా వేయించుకోవాలి. దీనివల్ల లోపలివరకు కాలుతుంది. నూనెనుండి తీసి పేపర్ మీద వేయండి. కొద్దిసేపు తర్వాత చల్లారాక డబ్బాలోవేసి దాచుకోండి.
6. అంతే జంతికలు రెడీ. కాస్త శ్రమపడితే రుచికరమైన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే జంతికలు సిద్దమవుతాయి.