మనకు మంచి జరిగితే దేవుడికి కృతజ్ఞతలు చెప్తుంటాం. అలాగే జీవితంలో మంచి కార్యాలు జరగాలని దేవుడికి పూజలు, అభిషేకాలు చేస్తుంటాం. అలా దేవుడికి అభిషేకం కోసం మనం ఇచ్చే ప్రతి వస్తువుకు ఒక ఫలితం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
తైలాభిషేకం చేయిస్తే అప్పుల బాధ తీరుతుంది.
బియ్యపు పిండితో అభిషేకం చేయిస్తే వ్యాధులు తొలగిపోతాయి.
పసుపు- సౌందర్యాన్ని పెంచుతుంది
కొబ్బరి నీళ్లు వంటి ద్రవ్య పదార్థాలతో దేవుళ్లకు అభిషేకం చేయిస్తే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది.
పంచామృతం- అనుకున్న కార్యాల్లో విజయం సాధన.
నెయ్యితో అభిషేకం చేయిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది.
పాలుతో అభిషేకం చేస్తే ఆయుష్షు పెంచుతుంది.
పెరుగుతో దేవుళ్లకు అభిషేకం చేయిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది.
తేనెతో అభిషేకం చేస్తే సుఖమయ జీవితం చేకూరుతుంది.
చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది.
చక్కరతో అభిషేకం చేయిస్తే శత్రుత్వం తొలగిపోతోంది.
అరటి పండుతో అభిషేకం చేస్తే రైతన్నల పంట సాగుబడి భేష్‌గా ఉంటుంది.
మామిడితో దేవుళ్లకు అభిషేకం చేయిస్తే శాంతి చేకూరుతుంది.
అన్నం, చందనం, పన్నీరు, విభూతి, శంఖువులతో అభిషేకం చేయిస్తే అధికారం, లక్ష్మీకటాక్షం, భయం తొలగిపోవడం, కీర్తి ప్రతిష్టలు లభించండతో పాటు దోషాలు, వ్యాధులు తొలగిపోతాయి. అలాగే పాలు, తేనె కలిపి దేవుళ్లకు అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.