గర్భిణి స్త్రీలకు సమతుల్యమైన ఆహారం ఇవ్వడం చాలా అవసరమని వైద్యులు చెబుతూ ఉంటారు. అలాగే గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
దీంతో పాటు సముద్ర ప్రయాణము, భర్త క్షవరము చేయించుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు.
ఇకపోతే.. గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.