కావలసిన పదార్థాలు:-
వెర్మిసెల్లి(సేమియా): 2cups
పంచదార: 1cup
నెయ్యి: 1/2cup
జీడిపప్పు,బాదాం, పిస్తా: 1/2cup
యాలకులపొడి: 1tsp
కుంకుమ పువ్వు: 1tsp
ఫుడ్ కలర్: చిటికెడు
తయారు చేయు విధానం:-
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో జీడిపప్పును వేసి దోరగా నేయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే నెయ్యిలో వెర్మిసెల్లీ(సేమియా) వేసి లైట్ గా ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత చిన్న గిన్నె తీసుకొని అందులో రెండున్నర కప్పు నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి.
4. ఇప్పుడు మరగే నీళ్ళలో వేయించుకొన్న సేమియా వేసి బాగా కలుపుతుండాలి. సేమియా సగభాగం మెత్తబడ్డాక, అందులో పంచదారను వేసి కలుపుకోవాలి.
5. ఈ మిశ్రమం దగ్గర అవుతుండగా అందులో చిటికెడు ఫుడ్ కలర్, యాలకులపొడి , కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి.
6. సేమియాలో నీరంత ఇమిరిపోయి మిశ్రం దగ్గర పడ్డాక క్రిందికి దింపుకొని జీడిపప్పు,బాదాం, పిస్తాలతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి అంతే సేమియా కేసరి రెడీ.