Wednesday, May 2, 2012

మెరుగయిన కేన్సర్ చికిత్సకు బంగారం?









భవిష్యత్తులో జరిగే కేన్సర్ చికిత్సల్లో బంగారు ఖనిజం కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇది త్వరలోనే ఆచరణ రూపు దాల్చుతుందని కూడా వారు చెపుతున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా, గ్రిఫిత్ విశ్వవిద్యాల నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ బృందం, రెండు రకాల ఇమేజింగ్ (కిరణాన్ని పరావర్తనం చెందించడం ద్వారా ఆయా అంశాల స్థితి గతులను తెలుసుకునే రేఖాపటం) పరిజ్ఞానాల ద్వారా చేసే కీమోథెరపీలో బంగారు ఖనిజాన్ని ఉపయోగించి చేసే రసాయనిక చికిత్సలు కేన్సర్ చికిత్సలో ఉపయోగపడతాయని కనుగొంది.

బంగారాన్ని ఉపయోగించి చేసే చికిత్సలో కేన్సర్ కణాలను విధ్వంసం చేయకుండానే వాటిని రూపుమాపడంలో సానుకూల ఫలితాలను ఆ బృందం గమనించింది. సూక్ష్మశ్రేణి ద్వితీయ పరమాణు స్పెక్టోమెట్రీ పరిజ్ఞానంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధన సారథి డాక్టర్ వెడ్‌లాక్ అంటున్నారు. వడపోత చేసిన ఎలక్ట్రానుల శక్తి ప్రసారాన్ని సూక్ష్మదర్శిని ద్వారా బంగారు మూలకాలను ఉపయోగించి కేన్సర్ కణాలను విశ్లేషించడమనేది మరొక పద్ధతి.

వైద్యపరమయిన రసాయన చికిత్సల్లో బంగారాన్ని ఉపయోగించి సత్ఫలితాలను పొందడమనేది గడచిన కొన్ని సంవత్సరాలుగా ధారణమయిపోయింది. ఇప్పుడు కేన్సర్ కారకాలను కూడా బంగారాన్ని ఉపయోగించి నిర్మూలించవచ్చని కనుగొనడం వైద్యపరిశోధనల్లో మరో మలుపు కాగలదని అంటున్నారు.