కావాల్సిన పదార్థాలు: -
ఉద్దిపప్పు: 1cup
మిరియాలు: 1tsp
పచ్చిమిర్చి: 3-6
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
తయారు చేయు విధానం:-
1. ముందుగా ఉద్దిపప్పును నీళ్ళలో వేసి రెండు నుండి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.
2. ఉద్దిపప్పు నానని తర్వాత మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం కూడా మిక్సీలో వేసి గరుకుగా (తొక్కులా)గ్రైడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు ఆకులను నీటిలో శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకొన్న ఉద్దిపప్పు ముద్ద, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు తరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు చేర్చి బాగా కలుపుకోవాలి.(మిరియాలను కొద్దిగా వేయించుకొని వేసుకోవాలి)
5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. ఇప్పుడు ఉద్దిపప్పు మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోనికి తీసుకొని ఉండగా చేసి ఎడమ చేయి అరచేతిలో పెట్టి వడలాగా తట్టుకొని మద్యలో రంధ్రం చేసుకొని వేడినూనెలోని మెళ్లిగా వదలాలి.
6. గారెలను రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే మసాలా గారెలు రెడీ. వీటిని అలాగే వేడి వేడిగా సర్వ్ చేయాలి. లేది కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి.