రోజుకు మూడు, నాలుగు ఖర్జూరాలు తీసుకోవడం వైద్యం దృష్ట్యా ఎంతో మంచిది. ఖర్జూరాల్లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీ ఖర్జూరాలు తింటే మంచిది. ఖర్జూరాల్లో ఫాస్ఫరస్ వుంది. కాబట్టి దీన్ని తింటే కేశాలు రాలిపోవడం, చుండ్రు వంటివి వుండవు.
అజీర్ణంతో బాధపడేవారు రోజూ పరగడుపున ఖర్జూరాలు తింటే మంచిది. ఖర్జూరాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎనీమియా వ్యాధి వున్నవారు తినడం మంచిది. చిన్నపిల్లలకు చాక్లెట్లు తినే అలవాటు మాన్పించాలంటే ఖర్జూరం తినటం అలవాటు చేయాలి.
ఖర్జూరంలో ప్రోటీన్లు, కాల్షియం, చక్కెర, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బి పుష్కలంగా ఉన్నాయి. నానబెట్టిన ఖర్జూరాలను పాలలో ఉడకబెట్టి, దానిని అరటి పండ్ల ముక్కలను కలిపి తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమని వైద్యులు చెబుతున్నారు.