Saturday, August 4, 2012

మీరు వృషభ, మిథున, కన్య లగ్నముల్లో జన్మించారా...!?







వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నములైన శనివర్గ జాతకులు నీలము, పచ్చ, వజ్రం, కుడిచేయి మధ్యవేలికి ఉంగరంగా ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈ జాతకులు నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ఇక 2, 4, 5, 7 అనే సంఖ్యలు కలిసివస్తాయి. నివాసానికి, వ్యాపారానికి, ఉత్తర, పశ్చిమ దిక్కులు అనుకూలిస్తాయి. వృషభ తుల లగ్న జాతకులకు దుర్గాదేవి డాలర్, మిథున, కన్య లగ్నకారులకు గణపతి డాలర్, మకర, కుంభ లగ్నజులకు శివుని డాలర్ ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు విజయవంతమవుతాయి.

అలాగే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నముల్లో జన్మించిన జాతకులు శుభగ్రహబలమునకు శివ, దుర్గా, గణపతి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఇక ఈ జాతకులకు జనవరి, ఫిబ్రవరి, జులై, ఆగస్టు మాసములు శుభకార్యములు చేపట్టేందుకు అనుకూలిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.