ప్రస్తుత రోజుల్లో ఎటువంటి సమస్యా లేకుండా గర్భం దాల్చడం అరుదుగా జరుగుతోంది. మారుతున్న కాలంతో పాటు, జీవన శైలిలో అనేక రకాల మార్పులు, ఆహారంలో మార్పులు, విశ్రాంతి లేకుండుట, అల్ప నిద్ర, ఒత్తిడి ఇవన్నీ ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతోంది. సమాజంలో ప్రతి 6 నుండి 10 జంటలను గమనించినట్లైతే వంధ్యత్వ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్త్రీలలో వంధ్యత్వ (పిల్లలు పుట్టకుండుట)లక్షణాలు ఒత్తిడితో ఏర్పడుతున్నవే. అయితే మరికొందరిలో కొన్ని పెద్ద సమస్యలు, కొన్ని చిన్న సమస్యలున్నా పిల్లలు కలగకపోవడానికి కారణం అవుతున్నాయి.
కారణం ఏదైనా కావచ్చు.. సమస్య చిన్నదే కావచ్చు అయితే వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల సంవత్సరాలు గడిచిపోతాయే తప్పు సమస్యను నివారించలేరు. కాబట్టి పిల్లలు కావాలనుకొనేవారు. డాక్టర్స్ ను సంప్రదించి చిన్న సమస్యఅయినా పెద్దదైదానా తెలిసిన వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోవడం ఉత్తమమైన పని. అంతే కాకుండా మహిళల్లో వంధ్యత్వానికి దారితీసే కొన్ని అసాధారణ సమస్యలను అధిగమించినట్లైతే తప్పకుండా పిల్లలు కలిగే అవకాశం ఉంది. మరి వంధ్యత్వానికి దారితీసే ఆ అసాధారణ విషయాలేంటో చూద్దాం...
చాక్లెట్స్: మీకు తెలుసా..? చాలా రకాల చాక్లెట్స్ లో కెఫిన్ అధికంగా కలిగి ఉంటుంది. అందుకే ఆ కెఫిన్ మనల్ని వాటికి వ్యసనపరులను చేస్తుంది. పిల్లలకోసం ప్రయత్నస్తున్నవారు చాక్లెట్స్ తినకపోవడమే మంచింది. చాక్లెట్స్ లో ఉన్న కెఫిన్ గర్భంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. నిజానికి కొన్ని కమర్షియల్ ఉత్పత్తులతో తయారు చేయబడినటువంటి చాక్లెట్స్ కి ప్లాస్టిక్ కవర్ తో చుట్టబడి ఉంటాయి. అవి వాతావరణ వేడికి కరిగి చాక్లెట్స్ లో మిలితమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్లాస్టిక్ ఆరోగ్యానికే కాదు, గర్భాశయానికి కూడా చాలా హానికరం. అలాగే కోకో కూడా చాలా హానికరం. మీరు కనుక కోకో ప్రియులైతే పిల్లలకోసం ప్రయత్నించేవారైతే వాటిని మానుకోవడమే ఉత్తమమైనది.
ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేయడం: స్ట్రెన్యుయస్ ట్రావెలింగ్ గర్బాన్ని సున్నితంగా ఉండేలా చేస్తుంది. పిల్లల కోసం ప్రయత్నించే వారు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేయడం వల్ల గర్భంపై చెడు ప్రభావం చూపుతుంది. ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు రోడ్స్ ఎగుడుదిగుడుగా ఉండటం వల్ల అది గర్భంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక వేళ గర్భం దాల్చే అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి పిల్లల కొరకు ప్రయత్నం చేసేవారు ట్రావెల్స్ తగ్గించుకోవాలి.
దంత సమస్యలు: గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా దంత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే గర్భాధారణ సమయంలో ఎక్కువగా క్యాల్షియంను కోల్పోయే ప్రమాదం ఉంది. మహిళల్లో చిగుళ్ళ సమస్యలు, దంత సమస్యలు ఉన్నట్లైతే గర్భం దాల్చేందుకు ఆలస్యం అవుతుంది. మహిళలు వారికి తెలియనటువంటి అనేక కారణాలు, సమస్యలతో వంధ్యత్వానికి గురౌతున్నారు. వాటిలో చిగుళ్ళ సమస్యలు కూడా ఒకటి. కాబట్టి గర్భిణి స్త్రీలకు, గర్భందాల్చే స్త్రీలకు ఎటువంటి దంత సమస్యలు లేకుండా చూసుకోవాలి.
ఊబకాయం లేదా బరువు ఎక్కువగా ఉండటం: సాధారణంగా చూసినట్లైతే చాలా మంది లావుగా ఉన్న మహిళల్లో పిల్లలు కలగపకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మహిళ ఊబకాయంతో ఉంటే గర్భధారణ అవకాశాలు చాలా తక్కువ. కారణం హార్మోనుల సమతుల్యత సరిగ్గా లేకపోవడం. జీర్ణక్రియలో వ్యత్యాసం, శక్తి సమతుల్యత వీటన్నింటిలో మార్పులు ఏర్పడతాయి కనుక. కాబట్టి బరువును తగ్గించుకోవడం ఎంతైనా మంచిది.
యాంటిఆక్సిడెంట్స్ కలిగినటువంటి బ్యూటీ క్రీములు: శరీరంలోని విషాలను తొలగించడానికి యాంటిఆక్సిడెంట్స్ కలిగిన క్రీములను వాడుతుంటాము. అయితే అవి గర్భం దాల్చడానికి హానికలిగిస్తాయంటే ఆశ్చర్యం కలగక మానదు. యాంటిఆక్సిండెట్స్ ఉన్నటువంటి క్రీములను వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి కొంత మంది మహిళల్లో యాంటిఆక్సిడెంట్స్ వంధ్యత్వానికి దారి తీస్తుంది కాబట్టి అటువంటి వాటిని వాడకపోవడమే మంచిది.