Friday, October 5, 2012

హస్తప్రయోగంపై భ్రమలూ, భయందోళనలూ....!?






చాలా మంది యువకులకు హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. హస్తప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు. అదే సమయంలో వారిని భయాలు, ఆందోళనలు వెంటాడుతుంటాయి. అటువంటి ఆందోళనే ఓ పాఠకుడు వ్యక్తం చేశాడు. రోజూ హస్త ప్రయోగం చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయా అని అడిగాడు.

 వీర్యం పోవడం వల్ల శక్తి క్షీణిస్తుందని, భవిష్యత్తులో సెక్స్‌‍కు పనికి రాకుండా పోతారనే వంటి అపోహలు సమాజంలో ఉన్నాయి. వీర్యకణాలు తగ్గిపోతుంటాయని కూడా చాలా మంది ఆందోళనకు గరువుతుంటారు. అయితే అవేవీ నిజం కాదని శాస్త్రీయ పరిశోధనల్లో తేలిపోయింది. ఆ భయాలు, ఆందోళనల వల్లనే ప్రమాదం సంభవిస్తుంది. వాటి వల్ల మానసికంగా యువకులు కృంగిపోయే ప్రమాదం ఉంది.

 అయితే, ఎక్కువ సార్లు హస్త ప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సెక్సాలజిస్టులు కొన్ని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. సాధారణంగా యుక్త వయస్సులో శృంగార హార్మోన్ల వలన కోర్కెలు బాగా ఉంటాయన్నారు. ఇది కేవలం కొందరిలోనే కాకుండా అనేక స్త్రీపురుషుల్లోనూ ఉంటాయట. టీనేజ్‌ వయసులో వచ్చే సహజసిద్ధమైన మనో శారీరక స్థితిగా దీన్ని పేర్కొంటున్నారు. అలా ఉండడం తప్పేమీ కాదు.

 హస్తప్రయోగం వల్ల ఏ మాత్రం నీరసంగానీ, ఇతర లైంగిక సమస్యలుగానీ రావు. రోజుల్లో ఎక్కువ సార్లు చేయడం వలన ఒక రకమైన ఆందోళన, అస్థిరత్వం ఏర్పడతాయని వైద్యులు చెపుతున్నారు. అలాగే, చదువుకోకుండా, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే చాలామంది యువకులు ఇంటర్‌నెట్‌లో అశ్లీల సైట్స్‌ చూస్తూ విపరీతమైన హస్తప్రయోగానికి పాల్పడుతుంటారని చెపుతుంటారు.

నిజానికి, మహిళల్లో కూడా స్వయంరతి వాంఛలు ఉంటాయి. వారు కూడా వివిధ పద్దతల్లో స్వయంతృప్తి పొందుతుంటారు. సామాజిక ఆచరణల వల్ల, మహిళల పట్ట పాతుకుపోయిన విశ్వాసాల వల్ల ఆ విషయం ఎక్కువగా చర్చలోకి రాదు.

అయితే, ఎల్లవేళలా లైంగిక వాంఛల గురించే ఆలోచిస్తూ ఉంటే చదువులో వెనకబడిపోవడమో లేదా కెరీర్‌పై దృష్టి సారించలేకపోవడమో జరుగుతుంది. హస్తప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందితే తప్పేమీ కాదు, సమస్యలేవీ రావు కానీ జీవితంలో తాను చేరుకోవాల్సిన గమ్యం కోసం శ్రమిస్తూ పోతే లైంగిక వాంఛలపై దృష్టి మళ్లి జీవితం సాఫీగా సాగిపోతుంది.