Wednesday, October 10, 2012

బుధ గ్రహ దోష నివారణకు విష్ణుపూజ చేయండి..!







బుధ గ్రహ దోష నివారణకు మహా విష్ణు పూజ చేయాలి. బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, మతిపరుపు, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.