పురుషులకు శిరస్థలికి కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటే శుభసూచకము. ఈ పుట్టుమచ్చ తేనె, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉండటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
శిరమునందు కుడిభాగమున పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి పరిపాలకుడిగా, సత్ప్రవర్తన కలిగి వాడుగా ఉంటాడు. జీవితంలో ఉన్నత పదవులను అలంకరించి, భోగభాగ్యాలను అనుభవిస్తాడు. సర్వసంపదలతో తులతూగుతాడు.
అదే పుట్టుమచ్చ ఎడమ భాగమున ఉంటే.. ఆ వ్యక్తి సన్యాసి అవుతాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే భాగస్వామి సర్దుకుపోతే ఆ వ్యక్తి జీవితం పురోగమనం వైపు కొనసాగుతుంది.
శిరమునందు ఎడమవైపు పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి ఇతరులకు బోధించడం, ఇతరులకు సేవచేయడమంటే ముందుంటాడు. అలాగే శిరము మీద ఎక్కడనైనా పుట్టుమచ్చ ఉన్నచో ఆ వ్యక్తి కీర్తివంతుడు, ధనవంతుడగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.