Monday, October 1, 2012

శనీశ్వరుడికి శనివారం అభిషేకం చేయిస్తే..!







శనీశ్వరుడికి శనివారం పాలాభిషేకం చేయిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. శనిదేవుని వలన బాధలు అనుభవిస్తున్న వారు, శనివారం నాడు శనీశ్వరాలయాల్లో గానీ, నవగ్రహమండపంలోని శ్రీ శనీశ్వరునికి గానీ అభిషేకం చేయడం మంచిది. అంతేకాకుండా నల్లని వస్త్రం, నల్లని నువ్వులు, నువ్వుల నూనె, మేకులు, ఇనుము, దర్భలు, బూరగదూది వంటివాటిని దానమివ్వడం మంచిది.

ఇవన్నీ చేయలేనివారు శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి, నువ్వులనూనెను శనీశ్వరుని విగ్రహానికి అభిషేకంగా పోసి, నల్లని వస్త్రమును శనీశ్వరుడిపై ఉంచి, పిడికెడు నల్లని నువ్వులను స్వామివారి ముందుంచి ప్రదక్షిణలు చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే శ్రీ శనేశ్వర షోడశనామస్తోత్రం
కోణశ్శశైశ్చరోమంద: ఛాయాహృదయ నందన:
మార్తాండజస్తథా సౌరి: పాతంగీ గ్రహ నాయక:
అబ్రాహ్మణ: క్రూరకర్మా నీల వస్త్రాంజన ద్యుతి:
కృష్ణోధర్మానుజ : శాంత : శుష్కోదర వర ప్రద:
షోడశైతాని నామాని య: వఠేచ్చ దినేదినే
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తన్యజాయతే. 
ఈ శ్లోకాన్ని ప్రతిదినం పఠించినట్లైతే శనీశ్వరుడి బాధలు పూర్తిగా తొలగిపోతాయి. భవిష్యత్తులో కూడ బాధలు కలుగవని పురాణాలు చెబుతున్నాయి.