బుధవారం తలస్నానం చేస్తే బుద్ధి కుశలతలు పెరుగుతాయని పండితులు అంటున్నారు. విద్యార్థులు, చిన్నారులు బుధవారం తలస్నానం చేస్తే విద్యారంగంలో రాణించి ఉన్నత పదవులను అలంకరిస్తారని వారు చెబుతున్నారు. మహిళలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయడం మంచిది. అదేవిధంగా పురుషులు శనివారాల్లో తలంటి స్నానం చేయడం శ్రేయస్కరం.
ఇకపోతే.. విద్యార్థులు బుధవారం తల స్నానం చేసి మూషిక వాహనుడైన గణపతిని, హనుమంతుడిని నిష్టతో ప్రార్థిస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయని పురోహితులు అంటున్నారు. అయితే ప్రార్థనతో పాటు సాధన కూడా తోడవ్వాలని అప్పుడే ఆశించిన విజయం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.
రోజంతా చదవడం మంచి పద్ధతే అయినప్పటికీ, చదివిన విషయాన్ని గుర్తి పెట్టుకునేందుకు వీలుగా కాసేపు విరామం తీసుకుని చదివిన విషయాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం మంచి అలవాటు. అదేవిధంగా చదవాలనే ఆసక్తి కలిగిన సమయంలో అధిక సమయం శ్రద్ధగా మనసు పెట్టి చదవడం చాలా మంచిది.
ఇకపోతే.. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.00 గంటలకు వరకు విద్యార్థులు చదివితే, జ్ఞాపకశక్తి రెట్టింపు కావడంతో పాటు చదివిన విషయమంతా మనసులో నిలిచిపోతుందని జ్యోతిష్కులు అంటున్నారు.