కవలపిల్లలకు జన్మనిచ్చిన దంపతులు విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విదేశానికి చెందిన ఓ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.
దీనిని బట్టి ఒక కుటుంబంలో కవలపిల్లలు జన్మిస్తే.. తద్వారా ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయని ఆ సర్వేలో తెలియవచ్చింది. ఇంకా కవలపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు విడాకులు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతోంది.
ఈ విషయమై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారంటే..? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథునం, మీనం, తులాం వంటి రాశుల్లో కవలపిల్లలు పుట్టినట్లైతే.. ఆ దంపతుల మధ్య మనస్తాపాలు తలెత్తే అవకాశముందంటున్నారు. అందుచేత పై మూడు రాశులకు చెందిన వారికి కవలపిల్లలు జన్మించే అవకాశం ఉంది.
ముఖ్యంగా మిథునరాశి జాతకులకు కవలపిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మిథున, మీనం, తులాం రాశులకు చెందిన వారికి కవల పిల్లలు జన్మించినట్లైతే.. ఆ దంపతులు పరస్పరం స్నేహితులుగా, ప్రేమికులుగా మెలగడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా వాగ్వివాదాలకు దిగడం, ఒకరినొకరు నిందించుకోవడం వంటివి చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి వివాదానికి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి కవలపిల్లలకు జన్మనిచ్చిన దంపతులు ప్రతి విషయంలోనూ సర్దుకుపోవడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.
సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బుధ గ్రహాధిపత్యం ఐదో స్థానంలో ఉంటే.. వారికి కవలపిల్లలు పుట్టే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇంకా ఒక కుటుంబంలో కవలపిల్లలు జన్మిస్తే.. బుధగ్రహాధిపత్యం పెరిగిందనే భావించాలి. బుధగ్రహం స్నేహం, ప్రేమ, విద్యా కారకుడవుతాడు.
కానీ కవల పిల్లలకు జన్మినిచ్చిన దంపతుల్లో అధిక శాతం విడాకులతో తెగతెంపులు చేసుకున్న వారే అధికమని తేల్చిన సర్వేకు.. జ్యోతిష్య శాస్త్ర గణాంకాలు కూడా సరిపోతున్నాయి. కాబట్టి కవలపిల్లలకు జన్మనిచ్చిన దంపతులు కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.