దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే గాకుండా పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారమ్ వంటి వాటికి కూడా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దిష్టి, దృష్టి అనబడే రెండింటిలో దిష్టి అనబడేది అతిభయంకరమైనది.
సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది.
శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గానీ, గోమయముతో గానీ షాపులను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాల పై భాగాన కానీ, పూజాస్థలంలో గానీ గుమ్మడి పైభాగంలో కొంతభాగంగా కోసి, అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది.
ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను ఇంటిముందు లేదా షాపుల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతిశనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు.
ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం షాపు లేదా దుకణాం మొత్తం పసుపునీళ్ళు చళ్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్రశనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.