ఏకంసత్ విప్రాః బహుధా వదంతి... అంటే పరమాత్మ ఒక్కటే. దానిని వేద వేత్తలు భిన్నంగా చెపుతున్నారు అని వేదం చెపుతున్నది. మానవుని అభిరుచిని బట్టి ఆరాధించుకోవడానికి, ఇన్ని విధాలుగా మానవులు రూపకల్పన చేసుకున్నారు.
పరమాత్మ నిరాకారుడు, నిరంజనుడు. ఈ ప్రపంచమంతా ఆయన వారసులే. అంటే ఆయన బిడ్డలే. " అర్జునా! నేను కానిదీ ప్రపంచంలో ఒక్క రేణువు కూడా లేదు" అన్నాడు కృష్ణపరమాత్మ. కనుక భగవంతునికి బిడ్డలున్నారా..? అనే సంశయానికి తావే లేదు.