అక్షః ప్రతిముఖమ్ ప్రత్యక్షమ్
అక్షః పరమ్ పరోక్షమ్ ||
అంటే కళ్ళ ఎదుట చూడటం ప్రత్యక్షం అనీ, కళ్ల ఎదుట కాకుండా ఊహతోనో, మరెవరో చెప్పగా వినో, చదివో, మనోనేత్రంతో చూడడాన్ని పరోక్షం అంటారు. దైవాన్ని ఎదురుగా చూడటం ప్రత్యక్ష దర్శనం అంటారు.
ఈ విధంగా దైవాన్ని దర్శించిన దైవాన్ని మనస్సులో ప్రతిష్టించుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించుకోవాలి. ఇలా జరగాలంటే ఏ కళ్ళతో దైవాన్ని చూసామో, ఆ కళ్ళను ఒకసారి అంతర్ముఖం చేసుకోవాలి.
అంటే కళ్ళతో దర్శించిన దైవ రూపాన్ని, కళ్ళు మూసుకుని మన హృదయానికి దైవరూపాన్ని అందించాలి. అలా చేసినప్పుడు హృదయం తనలో దాచిన రూపాన్ని మనం కోరుకున్నప్పుడల్లా చూపించగలుగుతుంది.
అందువల్లనే మనమెప్పుడో చూసిన దృశ్యాన్ని తిరిగి చూడగలగడం జరుగుతోంది. కాబట్టి కళ్ళు మూసుకుని దండం పెడుతున్నప్పుడు, మరలా మరలా తిరిగి ఆ ఇష్ట దైవాన్ని దర్శించాలని పురోహితులు అంటున్నారు. ఇలా భగవంతుడిని స్మరించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.