వింటర్ లో చలి... గిలి... ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం సూప్. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసమూ ఎగిరపోతుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. సూప్ ఒత్తిడిని తొగించి హృదయాన్ని తేలికపరుస్తుంది. ఆహారాన్ని తీసుకోవాలనే ఆత్రుతను రేపుతుంది. మరీ అలాంటి సూప్ ను ఓసారి ట్రై చేసి చూడండి...
కావలసిన పదార్థాలు:
టమాటాలు: 8
నీళ్లు: 4cups
మిరియాల పొడి : 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా టమాటోలను శుభ్రంగా కడిగి, రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమానికి నీటిని కలిపి స్టౌ మీద పెట్టాలి. బాగా మరుగుతుండగా మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం , వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి.
4. మంట తగ్గించి మరో పది నిమిషాల పాటు మరిగించి దించేసుకోవాలి. పుదీనా చల్లుకుని వేడి వేడిగా సేవిస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే టమోటో సూప్ రెడీ...