శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పౌర్ణమి రోజున స్తుతించే వారికి పదవోన్నతి లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. పౌర్ణమి, ప్రదోష కాలంలో లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించే భక్తులకు ఈతిబాధలు, ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది.
ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రదోషం, పౌర్ణమి, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. అభిషేకానికి పూర్తయిన తర్వాత తులసీ మాలను అర్పించి స్తుతించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.
లక్ష్మీ నరసింహ స్వామిని పై తిథుల్లో ఆరాంధించే వారికి తీరని రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయి. ఇంకా పదవోన్నతి, విదేశీయానం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.