Monday, April 29, 2013

మౌనవ్రతం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో తెలుసా......!?







పూర్వం మునులు, యోగులు, మహర్షులు మౌనవ్రతాన్ని పాటించేవారు. కానీ ఈ రోజుల్లో కూడా కొంతమంది మతాచార్యులు చాతుర్మాస దీక్షలో మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఇంకా కొంతమంది నెలలో కొన్ని రోజులు లేక వారానికి ఒక రోజున మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు.

ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం పాఠించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఆధ్యాత్మికంగా మౌనాన్ని పాటిస్తే వాక్‌సుద్ధి, వాక్‌శక్తి పెరుగుతాయి. ఇంకా ఆవేశం, కోపం, రోగాలను నియంత్రిస్తుంది.

అలాగే మనం ఇతరులపై కోపతాపాల్ని ప్రదర్శించకుండా కొంత సంయమనాన్ని పాటించినట్లయితే అనవసరమైన గొడవలు ఉండవు. కానీ మౌన వ్రతాన్ని పాటించడం ద్వారా మనస్సులో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది.

ఈ ప్రశాంతత ద్వారా టెంక్షన్లు, అశాంతి, కోపతాపాలకు దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగానూ మౌనవ్రతం మేలు చేస్తుందని వారు అంటున్నారు.