Wednesday, May 1, 2013

మూలానక్షత్రం రోజున గర్భిణీ స్త్రీలకు వాయనమిస్తే.....!?







ముగ్గుర్ని అంటే త్రిమూర్తులను సృష్టించిన అమ్మలగన్న.. ముగ్గురమ్మలగన్న అమ్మగా మూలకుటమ్మగా ప్రార్థనలు అందుకుంటోంది. ఆదిపరాశక్తిగానూ, లలితగానూ, రాజరాజేశ్వరిగానూ భిన్న నామాలతో అలరారుతున్న ఆ దేవదేవి జన్మించిన మూల నక్షత్రంలో కలిసిన బుధవారం రోజు ముత్తయిదువలను పూజించి, వాయనాలు ఇస్తే ఎంతో పుణ్యప్రదమని పురోహితులు చెబుతున్నారు.

పర్వతుని పుత్రిక కావడంతో పార్వతి అని ప్రసిద్ధురాలైన ఆ దేవదేవి పుట్టిన మూలా నక్షత్రం, బుధవారం కల్సినరోజు మహాపర్వదినంగా చెబుతున్నారు. అయితే ఈ తారా-వారముల సమ్మేళనం ఏ వంద సంవత్సరాలకొకసారి మాత్రమే సంభవిస్తుంది. కావున ప్రతినెలా వచ్చే మూల నక్షత్రం రోజున ముత్తైదువుల పూజ చేయిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం జరుగుతుంది. ఇలా చేయడం గృహిణిలకు భాగ్యం, సంతానభాగ్యంతో పాటు దీర్ఘాయువు లభిస్తుంది.

పార్వతీమాత జ్ఞానదేవత కనుక.. ఈమెకు బుధవారంనాడు చేసే పూజలు విశేషమైన ఫలాన్ని ప్రసాదిస్తాయి. బుధవారం నాడు పార్వతీదేవిని ఆలయాల్లో సందర్శించిన వారికి విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతాయి. మూలా నక్షత్రం రోజున గర్భందాల్చిన స్త్రీలకు పసుపుకుంకుమలు ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. ఇలా చేయడం వలన సంతానలేమీతో బాధపడుతున్న గృహిణికీ-పుచ్చుకున్న గర్భవతులకు అవిచ్ఛిన్నమైన వంశవృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.