Friday, December 13, 2013

New Voter ID Card Online





 

New Voter ID Card Online : Form-6

మీకు 18 సంవత్సరాలు నిండాయా? మీకు ఈ పాటికే వోటరు ఐడీ లేకపోతే Form-6 పూర్తి చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యవచ్చు! ఎన్నికల కమీషన్ దీనికి అవకాశం కల్పిస్తోంది. ముందుగా మీ పాస్ పోర్ట్ ఫొటో స్కాన్ చేసి jpeg format లో సిద్ధంగా ఉంచుకోండి. మీ చిరునామా వివరాలు, మీరు ఏ అసెంబ్లీ నియోజక వర్గానికి చెందుతారో తెలుసుకోండి. తర్వాత...

>> ఈ సైట్ కు వెళ్ళండి: http://www.ceoandhra.nic.in/
>> "E-Registration" టాబ్ నొక్కి "Form 6 (New Enrolment)" పై క్లిక్ చెయ్యండి.
>> వోటర్ ఐడీ కొరకు ఆన్ లైన్ అప్లికేషన్ ఎట్లా పూర్తి చెయ్యాలన్న వివరాలు ఈ కింది లింకులో ఉన్నాయి. చూడండి: http://www.ceoandhra.nic.in/ceonew/Formspdf/User_Document.pdf

ఫారం 16 పూర్తిచేసిన తర్వాత ఒక కాపీ ప్రింట్ తీసి భద్రం చెయ్యండి.. 2 నెలల్లో వోటరు ఐడీ రాకపోతే ఈ లింకులో ఫిర్యాదు చెయ్యవచ్చు! >> http://eci.nic.in/.

>> "Online Complaints" టాబ్ నొక్కండి.
>> "Citizen" మీట నొక్కండి.
>> "New User Registration" అనే బటన్ ఉపయోగించండి. లాగిన్ ఐన తర్వాత -
>> "Register a new complaint" అనేచోట మీ ఫిర్యాదు నమోదు చెయ్యండి. (మీ అప్లికేషన్ వివరాలు పేర్కోవాలి). లేదా -

ఈ టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి >> 1950 << (10 AM - 6 PM) మీ ఫిర్యాదు నమోదు చెయ్యవచ్చు!

కింది ధ్రువ ధ్రువ పత్రా అప్ లోడ్ చెయ్యడానికి వీలుగా స్కాన్ చేసి ఉంచుకోండి:
1. వయస్సు ధ్రువ పత్రం (18-21 సంవత్సరాల లోపు వారికి మాత్రమే)
2. పేరు ధ్రువ పత్రం (స్కాన్ కాపే)
3. జన్మ తేదీ ధ్రువ పత్రం (స్కాన్ కాపే)
4. నివాసం ధ్రువ పత్రం : (స్కాన్ కాపే)

ఈ కింది ధ్రువ పత్రాలు ఉపయోగించవచ్చు:

> బ్యాంక్/కిసాన్/పోస్ట్ ఆఫీస్ కరెంట్ పాస్ బుక్ ప్రతి
> రేషన్ కార్డు/పాస్ పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్ /ఆదాయ పన్ను రిటర్న్ /అసెస్మెంట్ ఆర్డర్
> ఇటీవలి గ్యాస్ బిల్/వాటర్ బిల్/ఫోన్ బిల్/కరెంట్ బిల్/
> దరఖాస్తు దారుడి పేరుతో పోస్టల్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన ఉత్తరం

ఈ కింది లింకులో వోటరు కార్డులు ఇచ్చే ఈ సేవా కేంద్రాల పేర్లు, చిరునామాలు ఉన్నాయి:
http://www.ceoandhra.nic.in/E_Seva_Centres/ESeva_Centers_18102012.pdf