రాత్రిసమయాల్లో మీరు భోజనం ఏ సమయానికి తీసుకుంటున్నారు. నిద్రపోయేందుకు అరగంట ముందా లేదా ఒక గంటా ముందు.. ఇలా అయితే తప్పకుండా ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రిపూట నిద్రించేందుకు రెండు గంటల ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కార్పోహైడ్రేడ్లు తక్కువగా గల సలాడ్లు, రోటీలను డిన్నర్‌గా తీసుకోవడం ఆరోగ్యప్రదం. రాత్రిపూట భోజనం 8.30 గంటలకు తీసుకోవటం చాలామంచిది. ఇలాచేస్తే జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు హాయిగా నిద్రపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు ప్రతిరోజూ తీసుకోవాలి. వారానికి రెండు సార్లు మాంసాహారం తీసుకోవాలి. జీర్ణక్రియకు రోజూ ఎనిమిది నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి.