టమోటా అంటే ఇష్టం లేదని ఎవ్వరంటూరు. ఎర్రగా దోరగా నిగనిగలాడతూ చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కొందరు వండేదాక అగడమాఅంటూ అలాగే తినేస్తారు. దీనితో చేయని వంటకం లేదు. కూర, చారు, పప్పు, పచ్చడి, జామ్ , జ్యూసు, కెచప్, సాస్ ... ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మరీ టమోటో ఊరగాయతో కొంచె వెరైటీ టేస్ట్ రుచిచూద్దాం. టమోటోను తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం...టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది.
టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. రోగనిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్ ఏ, విటమిన్ సి రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్ మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
టమోటోలు: 1/2kg
నూనె: 1/4ltr
కారం: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
మెంతులు: 1/2tsp
ఆవాలు: 3tbsp
చింతపండు: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు: 8-10
1. ముందుగా టమోటాల నీటిలో వేసి శుభ్రం చేసి, ప్లేట్ లోనికి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొడి బట్టతో తుడిచి తేమను పూర్తిగా తొలగించి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి చితగొట్టి దోరగా వేయించుకోవాలి వెంటనే అందులో టమోటో ముక్కలు, చింతపండును వేయాలి. తక్కువ మంట మీద టమోటోల్లోని తేమంతా పూర్తిగా పోయేదాకా బాగా మగ్గించాలి.
3. ఇప్పుడు మెంతుల్ని దోరగా వేయించి.. మెత్తగా పొడి చేసుకోవాలి. మెంతి పొడి తనగినంత ఉప్పు కారం, కలిపి మరో ఐదునిమిషాలుంచాలి.
4. వీటితో టమోటో బాగా గట్టిపడుతూ మగ్గిన తర్వాత దింపే ముందు ఆవపిండి కలిపితే సరిపోతుంది. నోరూరించే ఇస్టాంట్ టమోటో ఊరగాయ రెడీ. ఇది ఒక వారం రోజల పాటు నిల్వ ఉంటుంది. ప్రిజ్ లో పెట్టుకొంటే పదిహేను రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, వైట్ రైస్, పరోటాకి సూపర్ కాంబినేషన్.