Friday, June 1, 2012

పొటాటో కట్ లెట్....!?







మన ఇళ్లలో చాలా మంది బంగాళదుంప ‘ఆరోగ్యానికి' మంచిది కాదని చెబుతుంటారు, కాని స్వచ్ఛమైన బంగాళదుంపలు అత్యధిక కార్బొహైడ్రేట్లను కలిగి ఆరోగ్యానికి మంచి చేకూరుస్తాయి. రకరకాల వంటకాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. కూరగాను, చిప్స్ గాను, వేపుడు కూరగాను, ఇతర కూరలలోను, చికెన్‌, మటన్‌ వాటితో కలిపి గాని వాడితే మంచి రుచిగా ఉంటయి. ఇవి రుచింకే కాదు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజలవణాలు ఉన్నాయి. . . ఉదా : విటమిన్‌ సి , పొటాషియం , ఐరన్‌ , బి-కాంప్లెక్ష్ మున్నగునవి.

కావలసిన పదార్థాలు:

పొటాటో(బంగాళదుంప): 4
బ్రెడ్ స్లైస్: 6(చివరలు కట్ చేసి పొడిపొడిగా చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తమీర-పుదీనా తరుగు: 2tbsp
గరం మసాలా: 1/2tsp
ధనియా పౌడర్: 1tsp
బియ్యం పిండి: 3tsp
ఆమ్ చూర్ పౌర్(ఎండిన మామిడి పొడి): 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా బంగాళదుంపలను కావలసిన సైజులో కట్ చేసుకొని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి.


2. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ను క్రిందికి దింపుకొని బంగాళదుంపల్లోని నీరు వంపేస్ అవసరం అయితే చల్లటి నీటిని పోసి, బంగాళా దుంపలు చల్లారిన తర్వాత బంగాళదుంపలకు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళాదుంపను చిదిమి బౌల్ లో వేసి అందులో మిగిలి పదార్థాలను కూడా చేర్చి, అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి.

4. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకొని, తర్వాత అరచేతిలో పెట్టి గుండ్రంగా వడ సైజులో వత్తుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక బంగాళదుంప కట్ లెట్స్ ను అందులో కాగే నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ రెండు వైపులా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి.

6. అంతే పొటాటో కట్ లెట్ రెడీ. హాట్ హాట్ కట్ లెట్ సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే ఈవెనింగ్ హంగర్ గాన్....