ఉసిరికాయ చేతిలో ఉంటే చాలు సర్వరోగాలూ పోతాయని పెద్దలు అంటారు. ఇది అత్యుత్తమమైన మూలిక. అందుకే దీనిని మూలికల రాజు అంటారు. కాగా ఉసిరికాయని ఆయుర్వేద ఔషదాలలో విరివిగా ఉపయోగిస్తారు. అందువల్ల ఉసిరి ద్వారా ఆరోగ్యవంతమైన శరీరాన్ని మన సొంతం చేసుకోవచ్చు.
* ఉసిరికాయను వాడటం ద్వారా తొందరగా వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది.
* చర్మవ్యాదుల బారి నుంచి కూడా ఉసిరికాయ కాపాడుతుంది.
* ఉసిరికాయ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఆరోగ్యకరమైన శ్వాసక్రియకు ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది.
* ఉసిరిరసంలో నారింజ రసంలో కంటే 20 రెట్లు 'సి' విటమిన్ అధికంగా ఉంటుంది.
* ఉసిరికాయ బుద్ధిబలాన్ని అధికం చేస్తుంది.
* గుండెకు సంబంధించిన వ్యాదులు దరిచేర కుండా కాపాడుతుంది.
* ఉసిరికాయ కంటిచూపుని మెరుగుపరుస్తుంది.