కిస్‌మిస్ తీపి రుచి కలిగి వుండటమే కాకుండా పథ్యానికి ద్రాక్షకంటే కూడా చాలా మంచిది. ప్రతిరోజూ కిస్‌మిస్ పళ్ళ రసాన్ని తాగితే శరీరానికి చలువ చేస్తుంది. మూలవంశ ఉన్న రోగులు కిస్‌మిస్ పళ్ళుతింటే చాలా మంచిది. కిస్‌మిస్ పళ్ళరసం రోజుకి రెండు, మూడు సార్లు తాగితే శరీరానికి శక్తినిస్తుంది కిస్‌మిస్ తీసుకోవడం ద్వారా జీర్ణశక్తిని, పుష్టిని పెంచుతుంది.
అలాగే 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్‌మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.