పెరుగు, మజ్జిగ వాడితే నోటి క్యాన్సర్ రాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగు కడుపులో గ్యాస్ తయారు కాకుండా, కడుపు ఉబ్బరంగా వుండకుండా నివారిస్తుంది. ఆకలిని పెంపొందిస్తుంది. విష పదార్థాల్ని దూరంగా ఉంచుతుంది. పెరుగు వాడడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. స్త్రీలలో కనిపించే ఈస్ట్ జబ్బుని తగ్గిస్తుంది. పెరుగు రక్తంలోని కొలెస్టరాల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఫంగస్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది.
మరోవైపు వేసవితాపం తీరాలంటే.. ఒక చెమ్చా అల్లపురసం, కొంచెం పటికబెల్లం ముక్క, ఒక కప్పు నీటిలో కలిపి ఆ నీటిని తీసుకోవాలి. అరచెమ్చా అల్లపురసం, అరచెమ్చా తేనె కలిపి సేవిస్తే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.
అజీర్ణం కారణంగా కడుపునొప్పిగా వుంటే ఒక చెమ్చా అల్లపురసంలో ఒక చెమ్చా పంచదార కొద్దిగా నీటిలో కలుపుకుని తాగితే కడుపునొప్పి నిదానంగా తగ్గిపోతుంది. ఆహారంలో రోజూ అల్లపుముక్కను ఏదో విధంగా వాడితే కడుపు ఉబ్బరం వుండదు. జీర్ణ సంబంధ చిక్కులు వుండవు. తల తిరిగినట్లు అనిపించినా తలభారం అధికంగా వున్నా అరచెమ్చా అల్లపురసం, అరచెమ్చా నిమ్మరసం కలిపి తీసుకోవాలి.