Saturday, September 29, 2012

కామోద్దీపనకు కేంద్రం మెదడే, కానీ.....!?







కామోద్దీపనకు హృదయం ముఖ్యమని కవులంటారు. కానీ శాస్త్రనిపుణులు మెదడుదే ప్రధాన పాత్ర అంటున్నారు. సెక్స్‌కు అంగం పరిణామం ముఖ్యం కాదు, ఇతరత్రా ప్రధానం కాదు. ఇరువురిలో ఓ ముఖ్యమైన విషయం ప్రధాన పాత్ర వహిస్తుంది తమలో సెక్స్ స్పందనలు ఉన్నాయా లేవా అన్నదే ప్రధానాంశం. తృప్తిచెందడం అనేది మానసిక భావన.

మనసు ఉల్లాసంగా ఉంటే అదే లక్షకోట్ల ఆనందం ఇస్తుంది. అదే మానసిక స్థితి బాగోలేనప్పుడు ఎంతగా స్పందించినా తృప్తి అనేది ఉండదు. అందుకే ఆలుమగలు, ప్రియుడు ప్రియురాలు ఇద్దరిలోనూ ముందు ఒకరినొకరు ఇష్టం కలిగించుకునేలా నడుచుకోవాలి. ఒకరులేనిదే మరొకరు లేరనే భావన ఇద్దరిలో కలిగినప్పుడు వాళ్లు చేసే ప్రతి పనిలోనూ తృప్తి వంద శాతం ఉంటుంది.

అన్నింటికన్నా ముఖ్యం మన మెదడు. అదే అసలైన కామకేంద్రం. ఒకవేళ మనిషికి ఆందోళనలు, ఆర్థిక సమస్యలు, అనవసర భయాలు అందులో చోటుచేసుకుంటే అవి సెక్స్‌ సామర్థ్యాన్ని ఆటోమేటిక్‌గా తగ్గించి వేస్తాయి చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎప్పుడైతే ఆందోళనలు, భయాలు వీడిపోతాయో మళ్లీ సెక్స్‌ సామర్థ్యం దానంతట అదే పెరుగుతుంది. మానసిక ఆందోళన లేకుండా ఉంటే సెక్స్‌లో హద్దులులేని ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చని సెక్స్ వైద్య నిపుణులు చెపుతున్నారు.

అదే సమయంలో మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా రతిక్రీడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దంపతులు మనసారా రతిక్రీడలో పాల్గొంటే, ఆ రకంగా లోకాన్ని మరిచిపోతే ఒత్తిడి నుంచి బయటపడతారు. మనసు కేంద్రీకరించి రతిక్రీడ జరపాలి. అప్పుడు అది సంతృప్తిని ఇస్తుంది, సుఖాన్ని అందిస్తుంది.