పురుషుల కళ్లు సాధారణంగా స్త్రీ ఎదురుపడితే చాలు, ఆమె ముఖంపై కాకుండా ఆమె వక్షోజాలపైనే దృష్టి నిలుపుతాడు. ఆ చూపులను భరించే మహిళకే కాదు, అతని పక్కన వున్న మహిళ సైతం అవమానకరకంగా ఉంటుందట. అతను కొరుక్కుతినేలా మహిళ స్తనాలకేసి చూస్తాడు. తన మహిళతో ఆనందిస్తున్నా, పక్కనే వున్న మహిళ వక్షోజాలపైనే అతని దృష్టి ఉంటుందట.
అయితే, తన మహిళ నోటివెంట మరో మగాడి మాట వస్తే సహించలేడు. వొయ్యారాలు వొలకబోసే మహిళ కనిపిస్తే ఆమె చుట్టే తిరుగుతాడు. మీరు బయటకు వెళితే చాలు ప్రతి పదిహేను నిమిషాలకూ ఎక్కడ వున్నావ్... అంటూ ఫోన్ తో విసిగిస్తాడు. ఆ చర్యలో మీపై శ్రద్ధ కంటే కూడా అసహనం, కోపం అధికంగా వుంటాయి. అతను మీ జీవితంలోకి రాకముందు మీరు క్షేమంగా వున్నారని తెలియదా?
మహిళలకు ఆవేశం వుంటుంది కాని అది పురుషుల మాదిరిగా కాదట. ఆమె ఆవేశం మంచికే సాధారణంగా ఉపయోగపడుతుంది. పెళ్ళి తర్వాత తమ జీవితానికి ప్రాధాన్యతనివ్వకపోతే, మహిళకు నిజంగా అది ఒక హింసే. ఎపుడూ అంటిపెట్టుకుని వుంటావని నిందిస్తాడు. భార్యతో వినోద లేదా రొమాంటిక్ ట్రిప్ కు వెళుతూ కూడా అరడజను మంది స్నేహితులను కారు వెనుక సీటులో కూర్చోపెట్టటానికి సందేహించడు.
సాధారణంగా, సంకోచించకుండా మహిళలు పడకపై హాస్యం కోరతారు. పురుషుడి చర్యలు సుతి మెత్తగా వుండాలని భావిస్తారు. కాని పురుషుడు తాను గతంలో చూసిన సినిమాలోని హీరోయిన్ మాదిరిగా తన మహిళకూడా ఒక వ్యభిచార పాత్ర వహించాలని, బెడ్ పై తనను దడ డ లాడించేయాలని కోరుకుంటాడు. కనీసం ఆమెను ఆమె వ్యక్తిత్వానికి వదిలేద్దాం అనుకోడు కదా పైపెచ్చు ఆమె తనకు సహకరించటం లేదంటూ ప్రచారం చేస్తాడు. పురుషుడు తన అహంభావాన్ని వదిలించుకుని తన సహచరితో వ్యవహరిస్తే శృంగార జీవితం, తద్వారా దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది.