జీవితంలో సుఖపడటానికి, సన్నిహితులను సుఖపెట్టడానికి ప్రయత్నించే రోహిణి నక్షత్ర జాతకులకు ప్రేమ వివాహాలు కలిసిరావని జ్యోతిష్కులు అంటున్నారు. పెద్దలచే నిశ్చయించబడిన వివాహమే వీరికి కలిసొస్తుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వంశానికి, కుటుంబానికి మంచిపేరు తీసుకొస్తారు. అంతేగాకుండా అనుకున్న విధంగా సంతానాన్ని తీర్చిదిద్దుతారు.
ఇంకా ఈ నక్షత్రములో జన్మించిన వారు మానసిక దృఢత్వం కలిగి క్రీడల యందు, సాహస క్రీడల యందు రాణిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు. దీంతో పాటు జీవితంలో అడుగడుగునా విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలలో చదువు, అధునాతన విద్యలయందు గుర్తింపు పొందుతారు.
జల సంపద, భూ సంపదను కలిగి ఉంటారు. ఎన్ని విషయాల్లో విమర్శలు ఎదురైనా వాటిని మనస్సులోనే ఉంచుకుని అనుకున్న విధానాన్ని అమలు చేస్తారు. హాస్య, కళాప్రియులుగా ఉండే ఈ నక్షత్ర జాతకులు కళారంగంలో ఉన్నత స్థితిని సాధిస్తారు.
ఇంకా చెప్పాలంటే.. ఈ నక్షత్ర జాతకులకు తొందరగా కోపం రాదు. ఎప్పుడు చిరునవ్పుతో ఉంటారు. విదేశీ సంబంధిత ఎగుమతి, దిగుమతి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అపనిందలు, ఆరోపణలు జీవితంలో ఒక భాగం అవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.