Wednesday, October 3, 2012

నిద్రలేవగానే సూర్యుభగవానుడిని దర్శించుకుంటే..!?







ప్రతినిత్యం నిద్రలేవగానే సూర్యభగవానుడిని దర్శించుకుంటే ఆ రోజంతా శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే నిద్రలేవగానే స్వర్ణం, తామరపువ్వు, దీపం వెలుగు, అద్దం, సువాసనను వెదజల్లే చందనం, ఆవు-గేదె, వృక్షాలు, కుడిచేయి, మృదంగం, సముద్రం, పంట పొలాలు, గోపురాలను నిద్రలేవగానే వీక్షించేవారికి ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా స్వర్ణం, తామరపువ్వు, దీపం వెలుగు వంటి సీనరీలను మీ పడకగదిలో అంటించుకుని వాటిని ప్రతినిత్యం చూడటం ద్వారా మానసిక ఉల్లాసం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే ఎక్కడికైనా ప్రయాణమవుతున్న సమయంలో మహిళలు ఎదురుగా వస్తే చేపట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇంకా పండ్లు, పువ్వులు, పసుపు కుంకుమలు ఎదురుగా వస్తే శుభం చేకూరుతుంది.

ఇదేవిధంగా పాలు, పెరుగు, వేద, వాయిద్యాల ధ్వనులు వినబడటం జరిగితే శ్రేయస్కరం. వీటితో పాటు గుడ్లగూబ ఎడమ వైపు నుంచి కుడివైపు వెళ్లడం, కోతి, కాకి, చిలుక, కొంగ, కోడి వంటివి ఎడమవైపు నుంచి కుడివైపు వెళ్లినా ప్రయాణానికి అనుకూలమేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.