Wednesday, October 3, 2012

ఎక్కడికైనా ప్రయాణమవుతున్నారా..? వర్షం వస్తే ఆగండి.!







ఇతర దేశాలకు అంటే దూరప్రయాణాలకు బయలుదేరే ముందు కొన్ని సూచనలు పాటించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. విదేశాలకు లేదా ఏదేని శుభకార్యానికి ప్రయాణమయ్యాక వర్షం పడితే అశుభ సూచకమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వర్షం, చినిగిన దుస్తులు ధరించిన వ్యక్తులు ఎదురుగా వస్తే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే బలమైన ఈదురుగాలు వీచడం, కొత్త కుండను చూడటం, వర్షం కురవడం వంటివి జరిగితే ప్రయాణాల లక్ష్యం నేరవేరదు.

ఇంకా ఎక్కడికైనా ప్రయాణమయ్యాక శిరో ముండనం చేయించుకున్న వారిని చూడటం మంచిదికాదు. ముఖ్యంగా విదేశాలను బయలుదేరే సమయంలో సంబంధంలేని మాటలు అంటే..? "పోవద్దు, మేమూ నీతో వచ్చేమా..?" అనే వ్యాఖ్యలు వినడం కూడా అశుభ సూచకాలేనని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే తుమ్ములు, నిప్పు మండటం, పొగ, నూనె కుండలు కనిపిస్తే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం.