గృహంలో ఇలాంటి పటాలు ఉండకూడదట!
గృహంలో శుభఫలితాలు అందించే దేవతామూర్తుల పటాలను, ప్రతిమలను మాత్రమే ఉంచాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శాంతిమూర్తులైన దేవతల బొమ్మలను గృహమునందుంచితే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.
సరస్వతీ దేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రాలను గృహంలో ఉంచితే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇంట్లోని దేవుని పటాలకు గానీ, ప్రతిమలకు గానీ ప్రతినిత్యం లేదా వారానికి రెండు సార్లైనా కర్పూర హారతులు సమర్పించుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అలాగాకుండా ఎక్కడపడితే అక్కడ దేవుని పటాలను తగిలించడం, పూజగదిలోని విగ్రహ, పటాలకు మాత్రమే పూజచేయడం కూడదని వారు సూచిస్తున్నారు.
ఇకపోతే.. కాళిమాత వంటి సంహార దేవతల బొమ్మలను గృహము నందు ఉంచకూడదు. అదేవిధంగా ఉగ్రరూపం దాల్చిన దేవతల పటాలు ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇదేవిధంగా.. నెమలి వాహనంపై సుబ్రహ్మణ్యస్వామి విహరించే బొమ్మను, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న వేలాయుధం ఆయన భుజానికి పై ఉండే ఫోటోలను ఇంట్లో తగిలించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.