Monday, October 8, 2012

మీ రాశికి తగ్గ మొక్కలు ఏంటో తెలుసా?









మీ రాశికి తగ్గ మొక్కలు నాటండి...!
 
 
 ప్రతి మనిషికి ఒక రాశి అంటూ ఉంటుంది. ఆయా రాశులకు తగ్గట్టు వారివారి జీవితాలు ముడిపడి ఉంటాయి. వివిధ రాశులలో వివిధ గ్రహాల ప్రభావం ఉంటుంది. దీంతో వారి వ్యక్తిగత జీవితాలు మారిపోతుంటాయి.


మీ మీ రాశులకు తగ్గట్టు, వాటిపై ప్రభావం చూపే మొక్కలుకూడా ఉంటాయి. జ్యోతిష్యం ద్వారా సూచించే మొక్కలను మీ ఇంట్లో నాటండి. దీంతో మీ వ్యక్తిగత జీవితంపై మంచి ఫలితాలు చూపిస్తాయంటున్నారు జ్యోతిష్యులు.


రాశికి అనుగుణంగా మొక్కలు నాటండి :

** మేష రాశివారు ఉసిరికాయ చెట్టును నాటండి.

** వృషభ రాశివారు మేడి చెట్టును నాటండి.

** మిథున రాశివారు పొద్దుతిరుగుడు మొక్కను నాటండి.

** కర్కాటక రాశివారు చందనం, పారిజాతపు చెట్టను నాటండి.

** సింహ రాశివారు మోదుగ చెట్టును నాటండి.

** కన్యా రాశివారు పెసలు లేదా పసుపు చెట్టును నాటండి.

** తులా రాశివారు లవంగ లేదా సండ్ర చెట్టును నాటండి.

** వృశ్చిక రాశివారు వెదురు లేదా చెరకు చెట్టును నాటండి.

** ధనస్సు రాశివారు సండ్ర చెట్టును నాటండి.

** మకర రాశివారు రావి, తీగలు, తుమ్మ, మామిడి లేదా తులసి మొక్కలు నాటండి.

** కుంభ రాశివారు కదంబంలేదా కమలం మొక్కలు నాటండి.

** మీన రాశివారు నువ్వులు లేదా రావి చెట్టును నాటండి.

ఇలాంటి మొక్కలు మీకు నర్సరీల్లో తక్కువ ధరలలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు మీకు రుద్రాక్ష మొక్కలుకూడా లభ్యమవుతాయి. మీరు మొక్కలను కొన్న తర్వాత వాటిని ఎలా సంరక్షించుకోవాలోకూడా నర్సరీ వారు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.

మీ రాశికి తగ్గ మొక్కలను మీ ఇంటి పెరట్లో నాటుకుంటే మీకు ఎంతో శ్రేయస్కరం అంటున్నారు జ్యోతిష్యులు.