Sunday, October 7, 2012

కృత్తికా నక్షత్రమా? ఆకట్టుకునే అందం మీదే!















కృత్తికా నక్షత్రంలో జన్మించిన మహిళలు అందంతోపాటు ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగియుంటారని జ్యోతిష్కులు అంటున్నారు. ఇంకా ఐశ్వర్యవంతమైన కుటుంబంలో జన్మించిన వారై ఉంటారు. వివాహపరంగా కొన్నిసమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకునే విధంగా ప్రవర్తిస్తారు.


పట్టుదల స్వభావం కలిగి ఉండటం ద్వారా వీరికి సమస్యలు చెంతనే ఉంటాయి. అందుచేత ఈ స్వభావాన్ని దూరంగా ఉంచడం మంచిది. తమకు వీలైన సహాయంతో ఇతరులను ఆదుకోడానికి వెనుకాడని ఈ జాతకులు, వాక్చాతుర్యతతో అందరినీ ఆకట్టుకుంటారు.


ఇక కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారు ఎలా ఉంటారంటే..? విద్యారంగంలో గొప్ప స్థానాన్ని చేరుకుంటారు. అంతేగాక ఉన్నత పదవులను అలంకరిస్తారు. శ్రమించటం ద్వారా ఉన్నతాధికారుల ఆదరణ, మన్ననలు వీరికి లభిస్తాయి. దైవభక్తిని కలిగియుండటంతో పాటు సంగీతం పట్ల ఆసక్తిని చూపుతారు.


అన్ని రంగాలలో రాణిస్తారు. సుఖజీవనం గడుపుతారు. మంచి ఆదాయం చేకూర్చే వృత్తులను చేపడతారు. ఎలాంటి సమస్యలు ఈ జాతకుల జీవితంలో చోటు చేసుకోవు. అప్పుడప్పుడు కొన్ని వ్యాధులు తలెత్తడం జరుగుతుంది. బెంగ పడాల్సిన అవసరం లేదు.


రెండో పాదం : ఈ జాతకులు కోపగ్రస్థులు. ముందు ఆలోచన లేక కార్యాచరణ చేయటం ద్వారా అనేక సమస్యలకు గురవుతారు. ఈ స్వభావంతో ఇతరులు ఇబ్బందికి గురవుతారు. అందుచేత ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. కృత్తికా నక్షత్రం రెండో పాదములో పుట్టిన జాతకులు సమస్యల నుంచి బయటపడాలంటే శుక్రవారం పూట అమ్మవారి ఆలయ దర్శనం చేయడం మంచిది.


మూడో పాదం : ఈ పాదానికి చెందిన జాతకులు సమర్థవంతంగా ప్రవర్తించే నిపుణులు. ఎటువంటి కార్యాన్నైనా అతి సులభంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. చెడు మార్గంలో ప్రతికార్యాన్ని సాధిస్తారు. మంచి మార్గాలను పాటించక పోవటం ద్వారా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు తమ బుద్ధి కుశలతలను మంచి మార్గానికి ఉపయోగిస్తే అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.


నాల్గవ పాదం: నిదానంగా నెమ్మదిగా ఏ కార్యాన్నిచేపట్టటానికి పూనుకోరు. అన్నీ కార్యాల్లో ఎక్కువ తొందరపాటుగా వ్యవహరిస్తారు. ఇతరుల సలహాలను కొట్టి పారేస్తారు. విద్యా రంగంలో రాణించడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఎటువంటి కార్యాన్నైనా ప్రారంభించే ముందు గొడవలు చేయటం వీరి లక్షణం. కొద్దిపాటి జీవన సుఖాలను మాత్రమే ఈ జాతకులు అనుభవిస్తారు. అయితే తీవ్రంగా శ్రమిస్తే వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని జ్యోతిష్కులు అంటున్నారు.