Friday, October 12, 2012

బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా పెడితే..!?








శనిగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరునల్లార్ దేవస్థానాన్ని దర్శించుకుని శనిహోమం జరిపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తిరునల్లార్ మాత్రమే గాకుండా మందపల్లి, సింగనాపూర్‌, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శనైశ్వర ఆలయంలో శని త్రయోదశి నాడు అభిషేకం జరిపించడం శుభఫలితాలనిస్తుంది.

ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.

అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.

పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి

"ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:"
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.