1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు (1. శిక్షలు 2. వ్యాకరణము
3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)
3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు
4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.
5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము
7. నాటకములు
8. గానము (సంగీతం)
9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
10. కామశాస్త్రము
11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
12. దేశభాషాజ్ఞానం
13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.
14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు
15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము
16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము.
17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము.
18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము
19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం
20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము
21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము
24. పాకకర్మ= వంటలు
25. దోహళము=వృక్షశాస్త్రము
26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు
27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య
28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .
29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.
31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.
32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య
33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య
34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య
35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,
36. మోహనము - పరులను మోహింపజేయు
37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,
38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,
39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.
40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
41. వాణిజ్యము - వ్యాపారాదులు.
42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.
43. కృషి - వ్యవసాయ నేర్పు.
44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి
45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను
46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.
47. మృగయా - వేటాడు నేర్పు
48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.
49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.
50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.
51. చిత్ర - చిత్రకళ
52. లోహా - పాత్రలు చేయి నేర్పు
53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ).
54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు
55. దారు - చెక్కపని
56. వేళు - వెదరుతో చేయు పనులు
57. చర్మ - తోళ్ళపరిశ్రమ.
58. అంబర - వస్త్ర పరిశ్రమ
59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు
60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము
61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము
62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము
63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము
64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య