జ్యోతిష్యశాస్త్రానికి బుధుడు కారకుడు. అలాగే గణితానికి, విద్య తెలివితేటలు, పవిత్రత, విజ్ఞానము, జ్ఞాపకశక్తి వంటివి బుధుని కారకత్వములు. ఇక పేరు ప్రఖ్యాతలకు శుక్రుడు కారకుడు. గురువుతో కలిసి బుధుడు జ్యోతిష్యానికి ప్రధాన కారకుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి బుధ, శుక్ర గ్రహాలను పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
పరిశుభ్రమైన నీరు, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం కలిపి దానితో బుధ, శుక్రగ్రహాలకు అభిషేకం చేయిస్తే శుభఫలితాలుంటాయి. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, చెరకురసం, కొబ్బరిబొండా నీరు, చందనం వంటి వాటిని అభిషేకానికి వాడవచ్చు. ఇంకా విగ్రహం చుట్టూ వెలితి లేనంతగా పువ్వులతో అర్చన చెయ్యడం ఉత్తమం.
అలాగే శుక్ర, మంగళవారాల్లో గృహంలో శివపార్వతులు కలిసి వున్న ఫోటోను గానీ, ప్రతిమను గానీ ఉంచి పూజలు చేయాలి. ధూపాన్ని పాదాలకు, దీపం ముఖానికి చూపాలి. అన్నం, పళ్లు, కొబ్బరికాయ, పువ్వులు నీటిని నివేదనం చేసి తాంబులం, కర్పూర నీరాజనం చెయ్యాలి. ఆ తర్వాత శివపార్వతీలకు సంబంధించిన కీర్తనలు, స్తోత్రాలు గానం చెయ్యాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.