Sunday, March 31, 2013

ఏ దిశలో కూర్చుని భుజించాలి.....!?







మనిషికి శక్తినిచ్చేది ఆహారం. ఈ ఆహారాన్ని వివిధ రకాలుగా వివిధ రుచులతో తయారు చేసుకుంటాం. ఆయా దేశాలు, ప్రాంతాల ఆచారం బట్టి ఆహారాన్ని తయారు చేసుకుంటుంటాం. అంతే కాదు, అవి ఎంతో శుభ్రంగానూ, ఆరోగ్యకరంగా ఉండాలని భావిస్తాం.

అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వ కాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.

తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.

ఉత్తరం వైపు కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి.