సాధారణంగా ఆదివారమో, శెలవు దినమో వస్తే చాలు సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లాలనిపిస్తుంది. అక్కడ కాసేపు సేదతీరితే వారం అంతా పడ్డ కష్టం ఇట్టే మాయమవుతుంది మరి. అంతేకాదు, ఇంట్లో పిల్లలు ఉన్నా, లేక చుట్టాలు వచ్చినా అత్యధికంగా వెళ్లే చోటు బీచే.
బీచ్‌కు వెళ్లగానే, అక్కడి చల్లని గాలి, ఆహ్లాదం కలిగించే వాతావరణం ఉత్సాహం తెప్పిస్తుంది. అలల్లో ఆడుకునే పిల్లలు, ఎగిసి పడే కెరటాలు మనను ఊరికే ఉండనిస్తాయా? రా...రామ్మని పిలుస్తుంటాయి. అంతే మనం కూడా చిన్నపిల్లలాగా వెళ్లి ఆటలు ఆడేస్తుంటాము.
అయితే సముద్రంలో ఆటలు, స్నానాలు తదితరాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. వాటికి కొన్ని నియమాలుఉన్నాయి. ఇల్లాలు గర్భంతో ఉన్న సమయంలో సముద్రుడిని(సముద్రం) తాకకూడదట. అలాగే మంగళవారం, అమావాస్యలు ఒకే రోజున వస్తే అప్పుడు కూడా సముద్రం జోలికి వెళ్లకూడదట.
అంతేకాదు, ఆదివారం, పౌర్ణమి రోజులు కలిసి వస్తే చల్లని వెనెల్లో స్నానాలు చేసేస్తుంటారు చాలా మంది. కానీ శాస్త్ర రీత్యా ఇది మంచిది కాదట. కనుక ఈ రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో సముద్రంలో ఆటలాడుకుంటూ సంతోషంగా గడపవచ్చు.