కావలసిన పదార్ధాలు
ఇడ్లీ రవ్వ: 1cup
ఉద్దిపప్పు: 1cup
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్ : 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బీన్స్ : 1/4cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తురుము: 2tbsp
అల్లం: చిన్న ముక్క(తురుము)
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1tsp
తయారు చేయు విధానం
1. ముందుగా ఇడ్లీ పిండిని తయారు చేసుకోవాలి. అందుకు ఒక్క రోజూ ముందుగా ఉద్దిపప్పును నీటిలో 3-4 గంటసేపు నానబెట్టి, తర్వాత మెత్తగా గ్రైడ్ చేసి, రుబ్బుకొన్న పిండిలో ఇండ్లీ రవ్వను, కొద్దిగా ఉప్పు చేర్చిబాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. మరుసటి రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసే ముందుగా క్యారట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చిల ను శుభ్రమైన నీటిలో కడిగి ఒక ప్లేట్ లోనికి తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత వీటంన్నింటిని ఒక్కొక్కొటీ సపరేట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
4. అల్లం కూడా పై పొట్టు తీసి, కడిగి తర్వాత తురుమి పెట్టుకోవాలి. లేదా (పచ్చిమిర్చి, అల్లం కు కొద్దిగా ఉప్పు చేర్చి మిక్సీలో రఫ్ గా గ్రైడ్ చేసి వేసుకోవచ్చు)
5. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న అన్ని వెజిటేబుల్స్ ను వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
6. తర్వాత ఇడ్లీ గిన్నెలకు నెయ్యి రాసి వెజిటేబుల్ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్ లో రౌండ్ గా అమర్చుకొని, దాని మీద ఇడ్లీ పిండిని పోసి నింపుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ లో నింపుకొన్న తర్వాత ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి.
7. అంతే పది నిమిషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ క్రిందికి దింపుకొని ఇడ్లీలకు కొద్దిగా నెయ్యి రాసి తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్స్ లో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. ఈ న్యూట్రియట్ బ్రేక్ ఫాస్ట్ ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరం. ఇడ్లీకి మీకు ఇష్టమైన కారమైన చట్నీతో సర్వ్ చేస్తే భలే టేస్ట్ గా ఉంటాయి.