Thursday, June 7, 2012

ఆపిల్స్, ఉల్లి, ఆరెంజ్‌లతో రక్తనాళ సమస్యలకు చెక్...!!?






మీరు రక్తనాళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే రోజూ ఒక ఆపిల్ తీసుకోండి. తాజా అధ్యయనంలో ఆపిల్స్, ఉల్లి, ఆరెంజ్‌లను తీసుకోవడం ద్వారా రక్తనాళ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తేలింది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌ నిర్వహించిన పరిశోధనలో ఆపిల్స్, ఉల్లిపాయలు, ఆరెంజ్‌లను తీసుకోవడం ద్వారా రక్తనాళాలు మూసుకుపోవడం వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని తెలియవచ్చింది. రోజుకో యాపిల్ పండు లేక కమలాఫలం లేక ఉల్లిగడ్డ తింటే చాలు రక్తం గడ్డకట్టదు. అంతేకాదు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువే.

యాపిల్, ఆరెంజ్, ఉల్లిగడ్డల్లో ఉండే రుటిన్ అనే రసాయనం సిరలు, ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా బ్లాక్, గ్రీన్ టీల సేవనంతో రక్తనాళాలు మూసుకుపోవడంతో ఏర్పడే గుండెపోటు వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు తెలిపారు.