Friday, June 8, 2012

జాజికాయ పొడిని పాలలో కలుపుని తాగితే.. ..!?






పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడవు.

జాజికాయను తాంబూలం దినుసులలో, వక్కపొడి తయారీలోనే కాకుండా ఔషధంగా కూడా వాడతారు. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది.

అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది.