శాకాహారం మాత్రంమే ఎక్కువగా ఇష్టపడే వారు.. శాఖాహారంలో ఇష్టమైన ఆహారం ఆలూ దమ్. ఆలూ దమ్ ఇండియన్ ఫుడ్ లో అత్యంత ప్రాచుర్యం పొందినది. ఆలూ దమ్ ను బేబీ పొటాటో, పచ్చిబటానీలతో తయారు చేస్తారు. దమ్ ఆలూ మీకోసం...
కావలసిన పదార్థాలు:
ఆలూ(బంగాళదుంపలు): 1/2kg
నీళ్ళు: 2cups
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిడా
నెయ్యి: 1cup
ఉల్లిపాయ: 1
టమోటో గుజ్జు: 4tbsp
పెరుగు: 1cup
వేడి నీళ్ళు: 4tbsp
మిరియాలు:
గరం మసాలా: 1tsp
లవంగాలు: 4
బిర్యాని ఆకు: 4
మిరియాలు: 1/2tsp
యాలకులు: 4
చెక్క: చిన్న ముక్క
మసాలా కోసం:
ఉల్లిపాయ: 1
వెల్లుల్లిపాయలు: 6-8
అల్లం: చిన్న ముక్క
గసగసాలు: 1tsp
ధనియాలు: 1tbsp
జీలకర్ర: 1tsp
ఎండు మిర్చి: 2
పసుపు: 1tsp
జాపత్రి: చిన్న ముక్క
జాజికాయ: చిన్న ముక్క
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళాదుంపలకు పై పొట్టు తీసి, ఉప్పు నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.
2. రెండు గంటల తర్వాత పొట్టు తీసి పొడి వస్త్రంతో తేమను పూర్తిగా తుడిచి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె లేదా నూనె లేదా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో బంగాళదుంపలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి.
4. తర్వాత వేరొక పాన్ లో తగినంత నూనె వేసుకొని, వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
5. అంతలోపు మసాల కోసం సిద్దం చేసుకొన్న పదార్ధాలన్నింటిని మిక్సీ జార్ వేసి మెత్తని పేస్ట్ ను తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగే ఫ్రై చేయాలి.
6. పది నిమిషాల తర్వాత అందులో టమోటో గుజ్జు, పెరుగు, ఉప్పు, బాగా మిక్స్ చేయాలి.
7. తర్వాత అందులో వేయించి పెట్టుకొన్ని ఆలూ(బంగాళదుంప), కొద్దిగా వేడి నీళ్ళు పోసి మీడియం మంట మీద మరో ఐదు 5నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
8. చివరగా ఈ దమ్ ఆలూ మీద మిరియాలపొడి మరియు గరం మసాలా చల్లి రెండు మూడు నిమిషాల తర్వాత దించేసుకోవాలి. అంతే దమ్ ఆలూ రెడీ.