Monday, July 2, 2012

యువతీయువకులకు ఎపుడు వివాహం చేయాలి?











మహిళలకు 23 ఏళ్ల లోపే పెళ్లి చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అయితే పురుషులకు మాత్రం ఎన్ని సంవత్సరాల లోపు పెళ్లి చేయాలనే విషయాన్ని గమనిస్తే.. కలియుగాన్ని శని యుగం అంటారట. దీని ప్రకారం శనిగ్రహ ప్రభావంతో 22 లేదా 23 ఏళ్ల లోపే యువకులకు పెళ్లి చేసేయాలని వారు చెపుతున్నారు.

ఆధునికయుగంలో సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో నేటి యువత ఆడంబర జీవితానికి అలవాటు పడి, సంస్కృతిని మెల్ల మెల్లగా మరిచిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అందుచేత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 20-24 ఏళ్ల లోపు పురుషులకు కూడా వివాహం చేయడం ఉత్తమం.

ఇలా జరిగితే సమాజం ప్రభావం, పబ్‌లు షికార్లు వంటి ఆధునిక పోకడలకు బ్రేక్ వేసినట్లవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకా పురుషులకు 24, 25, 27లోపు వివాహమైతే మంచిదట. గురుగ్రహ ప్రభావంతో ఈ వయస్సులోపే వివాహం చేసేయడం మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు.