Tuesday, July 3, 2012

గురుగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే....!?






మానసిక, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, సంతానలేమి, వివాహాది కార్యక్రమాల్లో జాప్యం వంటివి జరుగుతున్నాయా..? అయితే తప్పకుండా గురు భగవానుడికి పూజ చేయాల్సిందేనని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గురుగ్రహ దోషంతోనే నిరాశనిస్పృహలు, ఇతరులచే మోసపోవడం వంటి ఫలితాలు కలుగుతాయి.

అందుచేత గురుగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరుచ్చెందూరు కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలా కుదరని పక్షంలో గురువారం పూట శెనగలను మాలగా కూర్చి ఆలయాల్లోని గురు భగవానుడికి సమర్పించడం ద్వారా దుష్పలితాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇంకా గురువారం సాయంత్రం గురు గ్రహం ముందు నేతితో దీపమెలిగించడం, పాలతో గురునికి అభిషేకం చేయించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.